Monalisa Bhosle: సడెన్‌గా హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన మోనాలిసా..
పూసలు అమ్ముకునే మోనాలిసా భోస్లే (Monalisa Bhosle)ను ఏకంగా విమానంలో విహరించేలా చేయడంలో సోషల్ మీడియానే పాత్రధారి. ఆ తరువాత ఆమె బాలీవుడ్ (Bollywood)లో చేస్తోందంటూ కథనాలు..
సోషల్ మీడియా (Social Media) ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తుందో.. ఎవరిని పాతాళానికి తొక్కేస్తుందో చెప్పడం కష్టం. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా (Maha Kumbhamela)లో పూసలు, రుద్రాక్షలు అమ్మే అమ్మాయిని అందలం ఎక్కించింది సోషల్ మీడియా.. ఎండలో ఇసుకలో తిరుగుతూ పూసలు అమ్ముకునే మోనాలిసా భోస్లే (Monalisa Bhosle)ను ఏకంగా విమానంలో విహరించేలా చేయడంలో సోషల్ మీడియానే పాత్రధారి. ఆ తరువాత ఆమె బాలీవుడ్ (Bollywood)లో చేస్తోందంటూ కథనాలు.. అవన్నీ ఏమయ్యాయో తెలీదు కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం సడెన్‌గా హైదరాబాద్‌లో ప్రత్యక్షమైంది.
ఎందుకంటారా? ఇంకెందుకు టాలీవుడ్‌లో మోనాలిసా తన జాతకాన్ని పరీక్షించుకోనుంది. అదేనండీ ఈ సోషల్ మీడియా క్వీన్ టాలీవుడ్‌లో తెరకెక్కనున్న ఓ చిత్రంలో (Monalisa Bhosle Telugu Movie) నటిస్తోంది. ఈ క్రమంలోనే మూవీ లాంచ్ ఈవెంట్‌లో సైతం సందడి చేసింది. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వర్ధమాన నటుడు సాయి చరణ్ ( Hero Sai Charan) హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. దర్శకుడు శ్రీను కోటపాటి (Director Srinu Kotapati) ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ చిత్రం పాన్ ఇండియా (Pan India) స్థాయిలో రూపొందనుంది. తెరకెక్కిస్తున్న చిత్రమిది.