Mohan Babu: కిడ్నాప్ వివాదంలో మోహన్ బాబు.. వెంటాడి మరీ పట్టుకున్న పోలీసులు
సినిమాల్లో విలనిజాన్ని అద్భుతంగా పండించిన నటులు నిజ జీవితంలో మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉంటారు. కానీ మోహన్ బాబు మాత్రం నిజ జీవితంలోనూ విలన్‌గా మారారు.
సినిమాల్లో విలనిజాన్ని అద్భుతంగా పండించిన నటులు నిజ జీవితంలో మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉంటారు. కానీ మోహన్ బాబు మాత్రం నిజ జీవితంలోనూ విలన్‌గా మారారు. తిరుపతిలోని ఎంబీయూ యూనివర్శిటీ వద్ద ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ లీడర్లను మోహన్ బాబు తన బౌన్సర్లతో కిడ్నాప్ చేయించిన ఘటన సంచలనంగా మారింది. పోలీసులు కిడ్నాప్ చేసిన వారిని వెంటాడి.. చివరకు మోహన్ బాబు ఫామ్ హౌస్‌లో గుర్తించి బాధితులను రిలీజ్ చేయించి.. బౌన్సర్లను అరెస్టు చేశారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన అదనపు ఫీజులను తిరిగి చెల్లించాలనే డిమాండ్‌తో ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నాలు చేస్తున్నారు.
అయితే ఇది నచ్చని మోహన్ బాబు తన బౌన్సర్లను పంపి వారిని కిడ్నాప్ చేయించినట్టుగా తెలుస్తోంది. ఎస్ఎఫ్‌ఐ నేతలను బౌన్సర్లు వాహనంలో తీసుకెళుతుండగా వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్లను వెంటాడి చివరకు మోహన్‌బాబు ఫామ్ హౌస్‌లో బంధీలుగా ఉన్న నేతలను విడిపించారు. విద్యాసంస్థల ప్రాంగణంలో విద్యార్థి సంఘాల నాయకులపై ఇలాంటి దౌర్జన్యాలకు ఇంతవరకూ ఎవరూ పాల్పడింది లేదు. ఆ ఘనత మోహన్‌బాబుకే దక్కుతుంది. యూనివర్శిటీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసిందని ఇటీవల ఉన్నత విద్యామండలే స్వయంగా గుర్తించింది. ఈ క్రమంలోనే అదనపు ఫీజులను వెంటనే వెనక్కి ఇచ్చేయాలని ప్రభుత్వం సైతం ఆదేశించింది. అయినా కూడా యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగాయి. దీంతో వారిని కిడ్నాప్ చేయించారు మోహన్‌బాబు. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.