Entertainment

Mitramandali: మీమర్స్, ఆడియెన్స్‌కి చాలా కంటెంట్..

ప్రియదర్శి (Priyadarshi), నిహారిక ఎన్ ఎం (Niharika NM) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మిత్ర మండలి’ (Mitramndali). విజయేందర్ దర్శకత్వం (Director Vijayender)లో రూపొందిన ఈ చిత్రం రేపు (అక్టోబర్ 16) విడుదల కానుంది.

Mitramandali: మీమర్స్, ఆడియెన్స్‌కి చాలా కంటెంట్..

ప్రియదర్శి (Priyadarshi), నిహారిక ఎన్ ఎం (Niharika NM) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మిత్ర మండలి’ (Mitramndali). విజయేందర్ దర్శకత్వం (Director Vijayender)లో రూపొందిన ఈ చిత్రం రేపు (అక్టోబర్ 16) విడుదల కానుంది. అయితే ముందుగానే అంటే అక్టోబర్ 15 సాయంత్రమే ప్రీమియర్స్ (Mitramandali Premieres) వేసింది. ఈ క్రమంలోనే దీనికి ముందు ప్రి రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ చిత్రంలో బ్రహ్మానందం (Brahmanandam), వెన్నెల కిషోర్ (Vennela Kishore), సత్య (Satya), విష్ణు ఓయి (Vishnu Oi), రాగ్ మయూర్ (Rag Mayur), ప్రసాద్ బెహరా (Prasad Behara), విటివి గణేష్ (VTV Ganesh) ముఖ్య పాత్రలు పోషించారు. దీనిలో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలను మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా బన్నీ వాస్ (Bunny Vas) మాట్లాడుతూ .. ‘మిత్ర మండలి’ ప్రీమియర్లకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. ప్రీమియర్లకు డిమాండ్ పెరిగిందని.. ముఖ్యంగా మౌత్ టాక్‌ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.

ప్రియదర్శి మాట్లాడుతూ .. ‘మిత్ర మండలి’ అందరినీ హాయిగా నవ్వించేలా ఉంటుందని.. మీమర్స్ (Memers), ఆడియెన్స్‌ (Audience)కి చాలా కంటెంట్ ఇస్తామన్నారు. ఓ కొత్త కంటెంట్‌తో పాటు ఇందులో తాను డ్యాన్స్ మూమెంట్స్ కూడా చేయాల్సి వచ్చిందన్నారు. తాము ఏం చేసినా సినిమా, స్క్రిప్ట్‌కు తగ్గట్టే ఉంటుందన్నారు. పది రోజులుగా నిద్ర లేకుండా ఈ మూవీ కోసం పని చేస్తున్నట్టు తెలిపారు. నిహారిక ఎన్ఎం మాట్లాడుతూ .. ‘‘మిత్ర మండలి’ లాంటి చిత్రంలో తనకు మంచి పాత్ర లభించిదని.. ఇలాంటి పాత్రలో ఊహించి, తనను తీసుకున్న డైరెక్టర్‌కు థాంక్స్ చెప్పింది. తెలుగులో తనకు ఇదే తొలి చిత్రమని.. ఎలాంటి ఫలితం వస్తుందోనని తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. దర్శకుడు విజయేందర్ మాట్లాడుతూ .. ‘మిత్ర మండలి’ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే.. ఏ పాత్ర ఎలా ప్రవర్తించాలి?.. ఎలా మాట్లాడాలి? అన్నది రాసుకున్నానని తెలిపారు. తనకు ఇది తొలి సినిమా కావడమే కాకుండా.. ఇంత మందిని హ్యాండిల్ చేయడం ఇబ్బందిగా అనిపించిందని విజయేందర్ పేర్కొన్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 15, 2025 3:07 PM