Ram Charan: మరో శుభవార్త చెప్పిన మెగా ఫ్యామిలీ.. ఈసారి డబుల్ కానున్న ఆనందం..
మెగాస్టార్ వారసుడి కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో చెప్పకనే చెప్పేశారు. ఇప్పుడు పుట్టబోయే కవలల్లో వారసుడుంటే ఆయన ఆనందం రెట్టింపవుతుందనడంలో సందేహమే లేదు.
మెగా కుటుంబం (Mega Family)లో సంతోషాలు రెట్టింపు కానున్నాయి. ఈసారి రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులకు కవలలు (Twins to Ramcharan and Upasana) జన్మనివ్వనున్నారు. ఇప్పటికే క్లీంకార (Klin Kaara)కు జన్మనిచ్చిన చెర్రీ దంపతులు.. తిరిగి మరో ఇద్దరిని ఆ చిన్నారికి జత చేయనున్నారు. అంతేకాదు.. ఈ కవలల్లో ఒక వారసుడు పుట్టాడో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఆనందానికి అవధులు ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే తన ఇల్లు లేడీస్ హాస్టల్‌లా మారిపోయిందని.. తాను లేడీస్ హాస్టల్ వాచ్‌మాన్ అంటూ సంచలనానికి తెరదీసిన మెగాస్టార్ వారసుడి కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో చెప్పకనే చెప్పేశారు. ఇప్పుడు పుట్టబోయే కవలల్లో వారసుడుంటే ఆయన ఆనందం రెట్టింపవుతుందనడంలో సందేహమే లేదు.
ఇటీవల చిరంజీవి (Chiranjeevi) తన నివాసంలో దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీ నుంచి పలువురు సన్నిహితులు సైతం హాజరయ్యారు. ఆ సయమంలోనే ఉపాసన సీమంతం వేడుకను సైతం నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియా (Social Media)లో షేర్ చేశారు. ఈ దీపావళి (Diwali) తమ ఇంట ఆనందాన్ని రెట్టింపు చేయడంతో పాటు తమ ప్రేమ, ఆశీర్వాదాలను సైతం రెట్టింపు చేసిందని ఉపాసన పేర్కొన్నారు. ఇది చూసిన వారంతా పెద్ద ఎత్తున రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగా కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా కవలలకు ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.