Mass Jathara: అన్ని మసాలాలు సరిగ్గా ఉన్న చిత్రం ‘మాస్ జాతర’
ఎనర్జీ మనిషి రూపంలో ఉంటే రవితేజ (Raviteja).. ఆయనతో నా అనుబంధానికి 20 ఏళ్లు. ఆయన నటనకు నేను ప్యాన్.. కాబట్టి ఫ్యాన్ బాయ్‌లా మాట్లాడుతున్నా. చాలా ఏళ్లుగా రవితేజపై ఫ్యాన్స్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు.
మాస్ మహారాజా రవితేజ (Raviteja), శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన చిత్రం ‘మాస్ జాతర’. ఈ చిత్రం కోసం రవితేజ అభిమానులు (Raviteja Fans) కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ (Nagavamsi), సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటి వరకూ రచయితగా మాత్రమే పరిచయమైన భాను భోగవరపు (Bhanu Bhogavarapu) ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర (Naveen Chandra) పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటించాడు. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రి రిలీజ్ (Mass Jathara Pre release Event) వేడుక అత్యంత వైభవంగా జరిగింది. దీనికి స్టార్ హీరో సూర్య (Hero Surya) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘‘ఎనర్జీ మనిషి రూపంలో ఉంటే రవితేజ.. ఆయనతో నా అనుబంధానికి 20 ఏళ్లు. ఆయన నటనకు నేను ప్యాన్.. కాబట్టి ఫ్యాన్ బాయ్‌లా మాట్లాడుతున్నా. చాలా ఏళ్లుగా రవితేజపై ఫ్యాన్స్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. తెరపై ఒక సాధారణ వ్యక్తిని కింగ్ సైజ్‌లో చాలా నేచురల్‌గా చూపించాలన్నా.. నటనతో పాత్రకు ప్రాణం పోయాలన్నా అది రవితేజకే సాధ్యం. నవ్వించడం అనేది చాలా కష్టం.. అందరికీ సాధ్యమయ్యేది కాదు. కానీ రవితేజ మాత్రం చాలా సునాయసంగా దీనిని చేసేస్తున్నారు. విక్రమార్కుడు రీమేక్ నా సోదరుడు కార్తీ (Hero Karthi) కెరీర్‌కి టర్నింగ్ పాయింట్. ‘మాస్ జాతర’ రూపంలో రవితేజ గారి జాతరను అక్టోబర్ 31న చూడబోతున్నాం. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
రవితేజ మాట్లాడుతూ.. "ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారు వేసిన సెట్స్ అద్భుతంగా ఉంటాయి. యాక్షన్ పరంగా ఫైట్ మాస్టర్స్ వెంకట్, పృథ్వీ.. సంగీతం విషయానికి వస్తే భీమ్స్‌కు క్రెడిట్ దక్కాలి. సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర శివుడి పాత్ర చేశాడు. సినిమా చూశాక నవీన్ గురించి అంతా మాట్లాడుకుంటారు. ఇలా కూడా చేయగలడా? అని అంతా ఆశ్చర్యపోతారు. రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)తో ‘రాజా ది గ్రేట్’ తర్వాత మళ్లీ ఈ సినిమాలో చేశాను. మా కాంబోనుప్రేక్షకులు మళ్లీ మళ్లీ కోరుకుంటారు. ఇక నాది, శ్రీలీల (Sreeleela)ది హిట్ జోడి. ఈ చిత్రంలో శ్రీలీల కొత్తగా కనిపిస్తుంది. భాను రూపంలో మంచి దర్శకుడు ఈ చిత్రంతో ఇండస్ట్రీకి దొరికాడు’’ అంటూ చెప్పుకొచ్చారు.
కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. "పెళ్లి సందడి విడుదలకు ముందు రవితేజ గారితో ‘ధమాకా’ చేశాను. ఈ తరువాత మళ్లీ ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. రవి తేజ గారు ఎప్పుడూ హుషారుగా, ఆనందంగా కనిపిస్తారు. ఆయన అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందనేది మీకు ‘మాస్ జాతర’ చూస్తే అర్థమవుతుంది. ఇంత మాస్ క్యారెక్టర్‌లో నన్ను నేను చూసుకున్నది లేదు. నాకు, రవితేజ గారి మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు రాజేంద్ర ప్రసాద్ గారి సన్నివేశాలు చాలా బాగుంటాయి’’ అని తెలిపింది. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. "అన్ని మసాలాలు సరిగ్గా ఉన్న మాస్ సినిమా ఈ మధ్య కాలంలో రాలేదన్న లోటుని తీర్చేందుకే ‘మాస్ జాతర’ వస్తోంది. అద్భుతమైన సినిమాని భాను తెరకెక్కించాడు. ఇక సినిమా గురించి కానీ.. నా పాత్ర గురించి కానీ నేనిప్పుడు మాట్లాడను. 'మాస్ జాతర' సినిమా చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులే మాట్లాడతారు" అని తెలిపారు.
నటుడు నవీన్ చంద్ర (Naveen Chandra) మాట్లాడుతూ.. "చాలారోజుల తర్వాత మాస్ జాతర రూపంలో శక్తివంతమైన పాత్ర లభించింది. రరవితేజ గారు, సూర్య గారి ముందు నిల్చొని మాట్లాడటం నాకు డబుల్ ధమాకాలా ఉంది. మనిషి ఎలా ఉండాలి? ఎలా ముందుకెళ్లాలి? వంటి అంశాలన్నీ రవితేజ గారిని చూసి నేర్చుకున్నా. 'అరవింద సమేత'లో బాలరెడ్డి పాత్ర తర్వాత నా కెరీర్ లో గుర్తిండిపోయే పాత్ర శివుడు అవుతుందనడంలో సందేహ లేదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sitara Entertainments) బ్యానర్ కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. 'అరవింద సమేత' (Aravinda Sametha)లో బాలరెడ్డి పాత్రతో నటుడిగా నాకు మరో జీవితాన్ని ఇచ్చిన ఈ బ్యానర్... తిరిగి ఇప్పుడు శివుడు రూపంలో మరో గొప్ప పాత్రలో నటించే అవకాశం ఇచ్చంది" అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "వెంకీ, విక్రమార్కుడు, కిక్ చిత్రాల్లాగా రవితేజ సినిమా అంటే ఏమి ఆశించి థియేటర్‌కి వస్తారో.. అవన్నీ ‘మాస్ జాతర’లో ఉంటాయి. ఈ చిత్రం ట్రైలర్ చూస్తే సినిమా స్థాయేంటనేది తెలుస్తుంది. సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. దర్శకుడు భాను భోగవరపు మాట్లాడుతూ.. "రవితేజ అభిమానుల్లో నేనూ ఒకడిని. రవితేజ గారు దర్శకులను పరిచయం చేసే ఒక యూనివర్సిటీ నెలకొల్పి దానిలో నాకు కూడా సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేనా దగ్గర ఉన్న ఒకే ఒక్క అర్హత నా కథ. అది నచ్చే రవితేజ గారు నాకు అవకాశమిచ్చి.. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర సర్ ప్రైజ్ చేస్తుంది. తులసి పాత్రలో శ్రీలీల తనలో ఉన్న మాస్ కోణాన్ని చూపించారు" అని అన్నారు.
ప్రజావాణి చీదిరాల