Manchu Manoj: మంచు మనోజ్‌కు బీభత్సమైన మైలేజ్.. ఎన్టీఆర్ విషయం గుర్తుందా?
చాలా కాలం పాటు సినిమాలు చేయలేదు. ఇటీవలి కాలంలో గొడవల కారణంగా కుటుంబానికి కూడా దూరమయ్యాడు. ఇక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా ప్రేక్షకులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.

ఆ వ్యక్తి హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇచ్చింది మొదలు.. కొన్ని చిత్రాలు చేశాడు కానీ బ్లాక్ బస్టర్ హిట్స్ అంటూ ఏమీ లేవు. ఇక ఎంతోకాలం హీరోగా చేసింది కూడా లేదు. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. చాలా కాలం పాటు సినిమాలు చేయలేదు. ఇటీవలి కాలంలో గొడవల కారణంగా కుటుంబానికి కూడా దూరమయ్యాడు. ఇక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా ప్రేక్షకులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికెళ్లినా కూడా ఆయన్ను ఓ స్టార్ హీరో రేంజ్‌లో రిసీవ్ చేసుకుంటున్నారు. ఆయన ఎవరో అర్థమయ్యే ఉంటుంది కదా..
ఇదంతా మంచు మనోజ్ (Manchu Manoj) గురించే. మంచు ఫ్యామిలీలో ఎవరినైనా ట్రోల్ చేస్తారేమో కానీ మంచు మనోజ్ జోలికి మాత్రం వెళ్లరు. ఎవరైనా సమస్యల్లో ఉన్నారన్నా కూడా మంచు ఫ్యామిలీ (Manchu Family) నుంచి ఆ మాటకొస్తే ఒక్కో సందర్భంలో ఇండస్ట్రీ నుంచే ముందుగా మనోజ్ వెళ్లి పరామర్శిస్తాడు. ఆ మంచితనమో మరొకటో కానీ అతనికి వరంలా మారింది. ఎవరూ కూడా మనోజ్‌ను ట్రోల్ చేయరు.. చేయలేరు. దీనికి కారణం ఆయన మంచితనమే. కనిపిస్తే చాలు.. మన పక్కింటి అబ్బాయిలా మనతో కలిసిపోతాడు. ఏ నటుడు ఇలా చేస్తాడు? అదే కారణమో లేదంటే కుటుంబానికి దూరమవడంతో మనోజ్‌కు అండగా జనం నిలిచారో కానీ మొత్తానికి మనోజ్‌కు అయితే కావల్సినంత మైలేజ్ వచ్చేసింది. అదే ఇప్పుడు ఏ సినిమాలో మనోజ్ నటించినా కూడా సినిమాలో అందరి కంటే మనోజే ఎక్కువగా పేరు సంపాదించుకుంటున్నాడు.
ఎన్టీఆర్‌కు బౌన్సర్‌గా..
మనోజ్ గురించి ఒక విషయం గుర్తు చేయాలి. ఒకానొక సమయంలో అంటే జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) తండ్రి హరికృష్ణ (Harikrishna) మరణించిన సమయంలో ఆయన భౌతిక కాయాన్ని సందర్శించుకునేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. కనీసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కార్యక్రమం నిర్వహించుకోవడం కూడా కష్టమై పోయింది. ఇక ఎన్టీఆర్‌కు అయితే ఆయనపై ఉన్న అభిమానంతో జనాలు ఎన్టీఆర్‌కు ఇబ్బందికరంగా మారారు. ఆ సమయంలో మనోజ్ బౌన్సర్‌గా మారిపోయాడు. అప్పట్లో ఈ విషయమై మనోజ్ టాక్ ఆఫ్ ది టౌన్ (Talk of the Town)గా మారిపోయాడు. ఇలాంటి కొన్ని విషయాలు మనోజ్‌కు కావల్సినంత మైలేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఇక ఇటీవల ‘భైరవం’ (Bhairavam) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి సక్సెస్ రావడంతో పాటు మనోజ్‌కు మంచి కమ్ బ్యాక్‌గా మారింది. ఆ తరువాత వచ్చిన ‘మిరాయ్’ (Mirai) మూవీ మనోజ్‌కు మంచి హైప్ ఇచ్చింది. హీరో తేజా సజ్జా (Hero Teja Sajja) కంటే కూడా మనోజ్‌కే ఈ సినిమా బాగా కలిసొచ్చింది.
దక్కిన తల్లి ప్రశంసలు
ఇక మనోజ్ ఎక్కడ కనిపించినా జనాలు అయితే వదలడం లేదు. చివరకు ఎయిర్‌పోర్టులో కనిపించినా కూడా ఆయనకు జనాలు బ్రహ్మరథం పట్టారు. ర్యాలీలు తీస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల వైజాగ్ వెళ్లినా కూడా అక్కడి జనాలు మంచు మనోజ్‌ను దగ్గరకు తీసుకున్న తీరు ఆసక్తికరంగా అనిపించింది. కుటుంబం కూడా ఇక ఆయనను దగ్గరకు తీసే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ‘మిరాయ్’ సినిమాకు గానూ.. మనోజ్‌కు తల్లి ప్రశంసలు బాగానే దక్కాయి. ఇక అక్క మంచు లక్ష్మి అంటారా? ఆమె మనోజ్‌ను ఎప్పుడూ వదిలేసింది లేదు. ఇక మిగిలింది ఇద్దరే మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu), విష్ణు (Manchu Vishnu). వీరిద్దరు కూడా త్వరలోనే మనోజ్‌కు దగ్గరవ్వాలని అవుతారని ఆశిద్దాం.
ప్రజావాణి చీదిరాల