Entertainment

Mirai Trialer Review: మంచు మనోజ్ వర్సెస్ తేజ సజ్జా.. వార్ గట్టిగానే..

యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ‘మిరాయ్’లో ఈ మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

Mirai Trialer Review: మంచు మనోజ్ వర్సెస్ తేజ సజ్జా.. వార్ గట్టిగానే..

యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మిరాయ్ (Mirai)’. కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamaneni) దర్శకత్వంలో పాన్ ఇండియా (Pan India Movie) చిత్రంగా రూపొందుతున్న ‘మిరాయ్’లో ఈ మంచు మనోజ్ (Manchu Manoj) విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. చూస్తుంటే ఇదొక విజువల్ వండర్‌లా అనిపిస్తోంది. తేజ సజ్జా మంచి ప్లాన్‌డ్‌గానే ముందుకు వెళుతున్నట్టు సినిమాను బట్టి తెలుస్తోంది. సెప్టెంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ‘మిరాయ్’ ప్రమోషన్స్‌ (Mirai Promotions)ను మేకర్స్ పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన అప్‌డేట్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచేవిగానే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ( Mirai Trailer)ను మేకర్స్ విడుదల చేశారు. వీఎఫ్ఎక్స్ ఈ సినిమాకు ప్రాణమని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

ట్రైన్‌లో నుంచి తేజ సజ్జా కిందపడిపోతున్న దృశ్యంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ‘ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది.. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయ్‌ని చేరుకోవాలి.. తొమ్మిది గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం..’ అంటూ సాగే డైలాగ్స్ చూస్తుంటే సినిమా మెయిన్ ప్లాట్ ఏంటనేది అర్థమవుతుంది. రితికా నాయక్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ‘ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా.. అంతా అప్పే.. ఈ రోజు నీ దగ్గర.. రేపు నా దగ్గర’’ అంటూ తేజ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. మంచు మనోజ్, తేజ సజ్జా మధ్య వార్ గట్టిగానే ఉంటుందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. మొత్తానికి ట్రైలర్ అయితే గూస్‌బంప్స్ తెప్పేంచాలా ఉంది. ఇక ఈ చిత్రంలో శ్రియా శరణ్ (Sriya Saran), జయరాం, జగపతిబాబు (Jagapathi Babu) తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 28, 2025 7:35 AM