Mana Shankaravaraprasad Garu Trailer: ఉతికి, పిండి, ఆరేశారు..
ట్రైలర్ ఆరంభంలో ఓ రేంజ్ మాస్ ఎలివేషన్‌తో వాయిస్ ఓవర్ ఇస్తుంటే.. చిరు బట్టలు పిండి ఆరేయడం, వంకాయను కట్ చేసి కారం పెట్టడం వంటి సన్నివేశాలు హిలేరియస్‌గా అనిపించాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ ఓ రేంజ్‌లో ఉండగా.. ప్రస్తుతం వచ్చిన ట్రైలర్ అంతకు మించి ఉంది. అనిల్ రావిపూడి తనదైన స్టైల్లో కామెడీని, యాక్షన్‌ను మిక్స్ చేసి కొట్టారు. ఇక చిరు చాలా కాలం తర్వాత తనలోని కామెడీ యాంగిల్‌ను బయటకు తీశారు. మొత్తంగా ట్రైలర్‌లో చిరు ఉతికి.. పిండి.. ఆరేశారు. ఇంకా చెప్పాలంటే.. కోసి కారం పెట్టారు. చిరు, నయనతార మధ్య వచ్చే సన్నివేశాలైతే మరింత ఆకట్టుకున్నాయనే చెప్పాలి. ఇద్దరికి ఇద్దరూ ఏమాత్రం తీసిపోకుండా నటించినట్టుగా ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
చిరు అయితే ఈ చిత్రంలో స్లిమ్ అవడంతో ఆయనకు వయసు ఒక 20 ఏళ్లు తగ్గినట్టుగా అనిపిస్తోంది. ఇక ట్రైలర్‌లో చిరు, విక్టరీ వెంకటేష్ మధ్య వచ్చే సన్నివేశాన్ని సైతం చూపించారు. ‘చూడటానికి మాంచి ఫ్యామిలీ మ్యాన్‌లా ఉన్నావ్.. ఇలా మాస్ ఎంట్రీ ఇస్తున్నావేంటి?’ అని వెంకీని చిరు అడిగితే.. ‘మాస్‌కే బాస్‌లా ఉన్నావ్.. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా.. ఏంటి?’ అని వెంకీ అంటారు. మొత్తానికి ఒకరొకరు పంచ్‌లు ఇచ్చుకోవడం ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్ ఆరంభంలో ఓ రేంజ్ మాస్ ఎలివేషన్‌తో వాయిస్ ఓవర్ ఇస్తుంటే.. చిరు బట్టలు పిండి ఆరేయడం, వంకాయను కట్ చేసి కారం పెట్టడం వంటి సన్నివేశాలు హిలేరియస్‌గా అనిపించాయి. ఓవరాల్‌గా ట్రైలర్.. మాస్‌కే బాస్‌లా ఉంది. మొత్తానికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ పండగకి వచ్చేస్తున్నారు. అదేనండి జనవరి 12న ప్రేక్షకులను పలకరించనున్నారు.
ప్రజావాణి చీదిరాల