Entertainment

Divvela Madhuri: ట్రాక్ తప్పుతున్న దివ్వెల మాదురి, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య

బిగ్‌బాస్‌లోకి కొత్త వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చేశారు. వారిలో దివ్వెల మాదురి (Divvela Madhuri), అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య (Alekhya Chitti Pickles Ramya) కూడా ఉన్నారు. నిన్నటికి నిన్న పెద్ద ఎత్తున రచ్చ చేసిన దివ్వెల మాదురి..

Divvela Madhuri: ట్రాక్ తప్పుతున్న దివ్వెల మాదురి, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య

బిగ్‌బాస్‌లోకి కొత్త వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చేశారు. వారిలో దివ్వెల మాదురి (Divvela Madhuri), అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య (Alekhya Chitti Pickles Ramya) కూడా ఉన్నారు. నిన్నటికి నిన్న పెద్ద ఎత్తున రచ్చ చేసిన దివ్వెల మాదురి.. ఆ తరువాత కూడా రమ్యతో కలిసి మాటలు జారడం సంచలనం రేపింది. ఇద్దరూ కలిసి ప్రస్తుతం హౌస్ కెప్టెన్‌గా ఉన్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గురించి మాట్లాడిన తీరు మరింత దారుణం. అతనొక అమ్మాయిల పిచ్చోడని.. తనూజ అతడిని ఎంటర్‌టైన్ చేస్తోందన్నట్టుగా రమ్య రెచ్చిపోయింది. అదే తనైతే అతడిని ఏదో చేసేదాన్నంటూ మాటలు జారింది రమ్య. ఇక దివ్వెల మాదురి వచ్చేసి.. అతడి ప్రొఫెషన్ ఏంటి.. అతను చేసేందంటంటూ ఘాటు వ్యాఖ్యలే చేసింది. మొత్తానికి ఇద్దరూ కలిసి పవన్ కల్యాణ్, తనూజలను క్యారెక్టర్ అసాసినేషన్ చేసి మరీ దారుణమైన కామెంట్స్ చేశారు.

ఇక దివ్వెల మాదురి తానొక పొలిటీషియన్ (Politician), గొప్పదాన్నన్న అహం హౌస్‌లోనూ చూపిస్తున్నారు. వాస్తవానికి బిగ్‌బాస్ హౌస్‌ (Biggboss House)లోకి ఒకసారి ఎంట్రీ ఇచ్చాక.. గొప్ప, పేద, ఇతర తారతామ్యాలు ఎవరూ చూడరు.. పట్టించుకోరు. ఒకవేళ అలా చేసినా కూడా వారికే దెబ్బ. ప్రేక్షకులు వారిని ఎక్కువ టైం హౌస్‌లో ఉండనివ్వరు. బయట అంతా చూసి వచ్చాక కూడా వీరిద్దరూ ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వీరిద్దరి కంటే ఆయేషా (Ayesha) చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. ఇవాళ నామినేషన్స్‌లో తనూజకు ఆమె పెట్టిన పాయింట్స్ సూపర్బ్ అని చెప్పాలి. అద్భుతంగా ఆమె తప్పులు ఏంటనేవి గట్టిగానే చూపించింది. ఆయేషా మాటల్లోని సారాంశం గ్రహిస్తే మాత్రం తనూజ (Tanuja Puttaswamy) ఆట పక్కాగా మారుతుందనడంలో సందేహమే లేదు. వాస్తవానికి ఆమె భరణితో బాండింగ్ అనేది కేవలం బిగ్‌బాస్ హౌస్‌ కోసమే పెట్టుకున్న బంధంగా తెలుస్తోంది. ఎంతసేపు తనకు భరణి (Actor Bharani) ఏదో చేయాలి. ప్రతి క్షణం తనకు అండగా నిలవాలన్న భావనలోనే ఆమె ఉంటోంది. ఇది కేవలం బిగ్‌బాస్ హౌస్‌లో సర్వైవ్ అవడం కోసమే చేస్తోందన్న భావన ప్రేక్షకుల్లో వస్తోంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 14, 2025 4:16 PM