Entertainment

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఎం4ఎం’

ఉత్కంఠభరిత కథాంశాలకు ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే మేకర్స్ సైతం ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఎం4ఎం

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఎం4ఎం’

ఉత్కంఠభరిత కథాంశాలకు ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే మేకర్స్ సైతం ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఎం4ఎం (M4M – Motive for Murder)’ రూపొందింది. ఈ చిత్రం మే 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు కాబోతోంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో ఈ చిత్రంలో నటించారు. పాన్ ఇండియా సినిమాగా ఐదు భాష‌ల్లో ఇది విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు.

భారతదేశంలో ఈ చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనుంది. అమెరికాలో ఈ సినిమా విడుదల బాధ్యతలను టెక్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఉత్తర భారతదేశంలో విడుదల బాధ్యతను జేవీఈఎల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు స్వీకరించాయి. దీంతో ఇండియా వ్యాప్తంగా సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. థియేటర్లలో విడుదలకు ముందే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా మంచి గుర్తింపు పొందింది. ప్రముఖ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా పాలెస్ సీ థియేటర్‌లో ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించగా, ముంబైలోని ఇంపా ప్రివ్యూ థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలకు సినీ వర్గాల నుంచి మంచి స్పందన లభించింది.

హీరోయిన్ జో శర్మ అమెరికా, భారత్‌లో విస్తృతంగా ప్రమోషన్ టూర్ నిర్వహించడం జరిగింది. ఈ టూర్ సినిమాకు బీభత్సమైన ప్రమోషన్‌ను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు-నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ, మే 8న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ఐదు భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నట్టు వెల్లడించారు. విడుద‌ల‌కు ముందే మా సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడటం గర్వకారణమని తెలిపారు. సినిమా ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన లభించిందని, థ్రిల్లింగ్ కథనం, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 7, 2026 3:02 PM