Lavanya Tripati: మెగా కోడలికీ తప్పని సోషల్ మీడియా వేధింపులు..
టైటిల్ చూసి మెగా కోడలికీ ఏంటి? అనే సందేహం రావొచ్చు. సాధారణ మహిళలు ఏం చేయలేరులే అన్న ధీమాతో సోషల్ మీడియా వేధింపులకు గురి చేస్తున్నారు. కానీ కాస్త హై ప్రొఫైల్ ఉన్న మహిళల జోలికి అంత త్వరగా ఎవరూ రారు.
టైటిల్ చూసి మెగా కోడలికీ ఏంటి? అనే సందేహం రావొచ్చు. సాధారణ మహిళలు ఏం చేయలేరులే అన్న ధీమాతో సోషల్ మీడియా వేధింపులకు గురి చేస్తున్నారు. కానీ కాస్త హై ప్రొఫైల్ ఉన్న మహిళల జోలికి అంత త్వరగా ఎవరూ రారు. దీనికి కారణం.. వారి ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఏమైనా చేస్తారనే భయం. కానీ వాటిని కూడా అధిగమించి మెగా కోడలు లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేశారు. దీనిపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘పర్పుల్ క్రెయాన్00’ ఇన్‌స్టాఖాతా ద్వారా లావణ్యతో పాటు కుటుంబ సభ్యులను సైతం టార్గెట్ చేస్తూ పోస్టులు, అసభ్య కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై లావణ్య తమ పరువుకు భంగం కలిగించేలా ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీచట్టం సెక్షన్ 67తో పాటు భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)78, 79 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ వేధింపులు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం, గౌరవాన్ని దెబ్బతీయాలని ఆరోపణలు చేస్తూ అవమానిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా కొన్ని పోస్టులపై కామెంట్ల రూపంలో అసభ్య పదజాలంతో దూషణలు సైతం చేస్తున్నారన్నారు. తన వ్యక్తిత్వం, నైతిక విలువలను ప్రశ్నించేలా ప్రచారం చేస్తున్నారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఇన్‌స్టా ఖాతా నడుపుతున్న ఆ వ్యక్తిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.