Entertainment

రొమాంటిక్ లవ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా ‘కొత్త మలుపు’

గాయని సునీత మాట్లాడుతూ.. ఆకాష్ ఎంతో కష్టపడే వ్యక్తి అని.. మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు. ఇది అతనికి రెండో సినిమా అని.. దర్శకుడు శివ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కథను తీసుకొచ్చారన్నారు.

రొమాంటిక్ లవ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా ‘కొత్త మలుపు’

ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్, భైరవి ఆర్థ్యా జంటగా నటించిన చిత్రం ‘కొత్త మలుపు’. ఈ సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తాటి బాలకృష్ణ నిర్మించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు భానుచందర్, ప్రముఖ గాయని సునీత, నిర్మాత సి కళ్యాణ్, నటుడు రఘుబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేమ, సస్పెన్స్, వినోదం సమపాళ్లలో ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో ఆకాష్, భైరవి బావ–మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషించగా.. యశ్వంత్ సంగీతం అందించారు. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాట్లాడుతూ.. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్‌లో ఈ సినిమాను రూపొందించామని.. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరిందన్నారు. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నామన్నారు. జూన్ 12న సినిమా విడుదల కానుందని శివ వరప్రసాద్ తెలిపారు.

గాయని సునీత మాట్లాడుతూ.. ఆకాష్ ఎంతో కష్టపడే వ్యక్తి అని.. మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు. ఇది అతనికి రెండో సినిమా అని.. దర్శకుడు శివ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కథను తీసుకొచ్చారన్నారు. మైత్రి సంస్థ ఈ చిత్రానికి అండగా నిలవడం గర్వకారణమన్నారు. సీనియర్ నటుడు భానుచందర్ మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుందని.. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారన్నారు. ఈ చిన్న సినిమాను ప్రేక్షకులు పెద్ద విజయంగా నిలబెట్టాలని ఆకాంక్షించారు. నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇది తనకు తొలి సినిమా అని.. దర్శకుడికి... హీరోయిన్‌కు తొలి సినిమా అని తెలిపారు. హీరో ఆకాష్‌కు రెండో సినిమా అన్నారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందన్నారు.

హీరో ఆకాష్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి మంచి కథ అందించిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. మైత్రి మూవీస్ వంటి సంస్థ మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హీరోయిన్ భైరవి ఆర్థ్యా మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ‘కొత్త మలుపు’ చాలా ప్రత్యేకమైన చిత్రమని... ప్రేమ, సస్పెన్స్, హాస్యం కలగలిపిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందన్నారు. ఆకాష్‌తో నా జోడీ, బావ–మరదళ్ల పాత్రలు ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయన్నారు.

నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. సునీత తన కుటుంబ సభ్యురాలిలాంటివారని... ఆమె కుమారుడు హీరోగా నటించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. నటుడు రఘుబాబు మాట్లాడుతూ.. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారంటే సినిమా స్థాయి అర్థమవుతుందన్నారు. ఆకాష్‌కు మంచి భవిష్యత్ ఉందని.. చిత్ర యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 'కొత్త మలుపు’ కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఉత్కంఠ, హాస్యం, కుటుంబ ప్రేక్షకులను అలరించే అంశాలతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందిందని చిత్ర‌యూనిట్ స‌భ్యులు తెలిపారు.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 1, 2026 12:24 PM