Kantara Chapter 1 Trailer: అదో పెద్ద దంత కథ..
ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళతాడో.. ధర్మాన్ని కాపాడటానికి ఈశ్వరుడు తన గణాలను పంపుతూనే ఉంటాడు’ అంటూ ట్రైలర్‌లో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.

2022లో విడుదలై రికార్డు సృష్టించిన చిత్రం ‘కాంతర’. టాలీవుడ్‌లో సైతం ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ఇప్పుడు ప్రీక్వెల్ రూపొందింది. ‘కాంతార చాప్టర్ 1’ పేరిట రూపొందిన ఈ ప్రీక్వెల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఒక్కొక్కటిగా అప్‌డేట్స్ వదులుతూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ (Kantara Chapter 1 Trailer) విడుదలైంది. ఈ ట్రైలర్‌ను స్టార్ హీరో ప్రభాస్ విడుదల చేశారు. పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హోంబలే ఫిలిమ్స్ (HombaleFilms) బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ (Vijay Kiragandur) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ (Rukmini Vasant( హీరోయిన్‌గా నటిస్తోంది.
రిషబ్‌శెట్టి ప్రధాన పాత్రలో.. ఆయన స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌లోని సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ‘నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు’ అన్న ఓ చిన్నారి సందేహంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ‘ఇదే మన మున్న శివ మన పూర్వీకులంతా ఉన్నది ఇక్కడే అదో పెద్ద దంత కథ..’ అన్న వాయిస్ ఓవర్‌తో కథ చెప్పించే ప్రయత్నం చేశారు దర్శకుడు. ‘ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళతాడో.. ధర్మాన్ని కాపాడటానికి ఈశ్వరుడు తన గణాలను పంపుతూనే ఉంటాడు’ అంటూ ట్రైలర్‌లో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక ట్రైలర్ ఆద్యంతం ఎంతో గ్రాండియర్‌గా అనిపించింది. మంటల్లో నుంచి అమ్మవారి రూపం ఒకటి కనిపిస్తుంది. అది ట్రైలర్‌కే హైలైట్ అని చెప్పాలి. ఆ సన్నివేశం వెండితెరపై చూస్తే మాత్రం గూస్‌బంప్స్ రావడం పక్కా. మొత్తానికి సినిమాను ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దినట్టు ట్రైలర్‌ను చూస్తేనే అర్థమవుతోంది.
ప్రజావాణి చీదిరాల