Entertainment

Kantara Chapter 1: మరో రికార్డ్.. కానీ ఆ సినిమాను టచ్ కూడా చేయలే.

భాషా భేదం లేకుండా ‘కాంతార చాప్టర్ 1’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డును క్రియేట్ చేసింది.

Kantara Chapter 1: మరో రికార్డ్.. కానీ ఆ సినిమాను టచ్ కూడా చేయలే.

భాషా భేదం లేకుండా ‘కాంతార చాప్టర్ 1’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డును క్రియేట్ చేసింది. కేవలం రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.717 కోట్లకు పైగా (Kantara Chapter 1 Collections) గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ చిత్రం కేవలం రెండు వారాల్లో ఈ రూ.717 కోట్ల వసూళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచే రూ.105 కోట్లకు పైగా రాబట్టినట్టు సినీ వర్గాలు తెలిపాయి.

మొత్తానికి రూ.717 కోట్ల వసూళ్లతో ‘కాంతార 1’ మరో రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ చిత్రాల జాబితాలో రెండో స్థానానికి ఈ సినిమా చేరుకుంది. తొలి స్థానంలో కేవలం రెండు వారాల్లో రూ.1200 కోట్లకు పైగా వసూళ్లతో ‘కేజీయఫ్‌ 2’ తొలి స్థానంలో నిలిచింది. దీని దరిదాపుల్లోకి కూడా ఇప్పటి వరకూ మరే చిత్రమూ వెళ్లలేదు. చివరకు ‘కాంతార చాప్టర్ 1’ కూడా ట్రై అయితే చేసింది కానీ ‘కేజీఎఫ్ 2’ చేరువకు మాత్రం వెళ్లలేకపోయింది. ‘కాంతార చాప్టర్‌ 1’ ఈనెల 2న విడుదలై.. తొలి రోజే రూ.89 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక వసూలు చేసిన కన్నడ సినిమాల జాబితాలో స్థానం దక్కించుకుంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 17, 2025 9:20 AM