Mass Jathara: జాన్ గ్రీషమ్ నావెల్స్ అంటే ప్రాణమట.. ‘వెంకీ’ని గుర్తు చేసిన రవితేజ
‘కేజీ.. రెండు కేజీలు కాదురా.. 20 టన్నులు.. ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైన్‌లో ఎక్కించండి’ అంటూ నవీన్ చంద్ర చెప్పే డైలాగ్‌తో ‘మాస్ జాతర’ ట్రైలర్ (Mass Jathara Trailer) ప్రారంభమవుతుంది.
మాస్ మహారాజా రవితేజ (Raviteja) అభిమానులతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మాస్ జతర' (Mass Jathara) సినిమా ట్రైలర్ (Mass Jathara Trailer) ఎట్టకేలకు విడుదలైంది. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అసలు సిసలైన మాస్ వేడుకలా ఈ ట్రైలర్ ఉంది. ‘కేజీ.. రెండు కేజీలు కాదురా.. 20 టన్నులు.. ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైన్‌లో ఎక్కించండి’ అంటూ నవీన్ చంద్ర చెప్పే డైలాగ్‌తో ‘మాస్ జాతర’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. రైల్వే ఎస్సైగా రవితేజ.. బాణంతో గురి చేసి టార్గెట్‌ను ఛేదిస్తూ ట్రైలర్‌లో కనిపిస్తాడు. ‘ఇన్నాళ్లూ నువ్వు నా లిమిట్‌లోకి రాక నీ దందా నడిచింది.. ఇక నుండి సత్యనాశ్.. నేను రైల్వే పోలీస్ కాద్.. క్రిమినల్ పోలీస్’ అంటూ రవితేజ ట్రైలర్‌లో అదరగొట్టాడు. ‘వెంకీ’ చిత్రంలో జాన్ గ్రీషమ్ నావెల్ మరోసారి ఈ చిత్రంలో వాడేశారు.
జాన్ గ్రీషమ్ (John Greesham) నావెల్‌ను శ్రీలీలకు రవితేజ ఇస్తాడు. అది చూసి శ్రీలీల (Sreeleela) ‘మీకు జాన్ గ్రీషమ్ నావెల్స్ అంటే ఇష్టమా?’ అంటుంది. ‘ప్రాణమండి’ అంటూ రవితేజ మరోసారి వెంకీ (Venky Movie)ని గుర్తు చేశారు. మొత్తమ్మీద ట్రైలర్ అయితే మాస్, క్లాస్ తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్‌గా శ్రీలీల కనిపిస్తోంది. రవి తేజ, నవీన్ చంద్ర (Naveen Chandra) మధ్య సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత నవీన్ చంద్ర పవర్‌ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇక శ్రీలీల తొలిసారి శ్రీకాకుళం యాసలో మెప్పించింది. అంతా శ్రీలీలకు శ్రీకాకుళం యాస సెట్ అవుతుందా? అనే సందేహం ఉంది. ట్రైలర్ చూసిన వారికి ఆ సందేహం తీరిపోతుంది. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రజావాణి చీదిరాల