Entertainment

BRS: వామ్మో.. బీఆర్ఎస్ అవినీతి చిట్టా ఇంతుందా? లిస్ట్ బయటకు తీస్తున్న కాంగ్రెస్

ఒక వేలు ఎదుటి వ్యక్తి వైపు చూపిస్తే నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తాయట. అది తెలుసుకోకుంటే నలుగురిలో ఫూల్ అయ్యేది మనమే. రాజకీయాల్లో గురివిందలు ఎక్కువే. అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సర్వసాధారణం.

BRS: వామ్మో.. బీఆర్ఎస్ అవినీతి చిట్టా ఇంతుందా? లిస్ట్ బయటకు తీస్తున్న కాంగ్రెస్

ఒక వేలు ఎదుటి వ్యక్తి వైపు చూపిస్తే నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తాయట. అది తెలుసుకోకుంటే నలుగురిలో ఫూల్ అయ్యేది మనమే. రాజకీయాల్లో గురివిందలు ఎక్కువే. అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సర్వసాధారణం. అయితే మనవైపు తప్పులు పెట్టుకుని అధికారంలో ఉన్న పార్టీపై నోరేసుకుని పడిపోతే వాళ్లూ లెక్కలు తీస్తారు కదా.. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ గట్టిగానే వస్తోంది.

ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) ముఖ్య నేత హరీష్ రావు (Harish Rao) వచ్చేసి రెండేళ్లుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ బిల్లులు (Arogyasri Bills) రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయట. అసలు రేవంత్ ప్రభుత్వం (Revanth Government) ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? 7 డిసెంబర్ 2023న రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM Revanth Reddy)గా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే రెండేళ్లు కూడా అవలేదు. మరి రెండేళ్లుగా బిల్లులు పెండింగ్‌లో ఉంటే ఆ తప్పెవరిది? గత ప్రభుత్వానిది కాదా? ఆ సమయంలో పెండింగ్ బిల్లులను ఎందుకు క్లియర్ చేయలేదు? హరీష్ చెబుతున్న దాని ప్రకారం చూస్తే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లుల (Pending Bills)ను క్లియర్ చేయకుండా వదిలేసినట్టే కదా. మీరు పెండింగ్‌లో పెట్టి ఈ ప్రభుత్వంపై నిందలేయడమేంటి? అనేది గతంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా పని చేసిన హరీష్ రావే చెప్పాలి. గత ప్రభుత్వంలో నెలకు రూ.50 కోట్లు కూడా రిలీజ్‌ అవ్వలేదు కానీ తాము మాత్రం నెలకు రూ.100 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarasimha) చెబుతున్నారు. పైగా ఇటీవలే రూ.100 కోట్లు విడుదల చేసినట్టు కూడా తెలిపారు దీనికేమంటారు? సరే ఈ విషయాన్ని పక్కనబెడదాం.

వందల కోట్ల బకాయిలు ఎక్కడివి?

ఇక కాలేజీలకు వందల కోట్ల బిల్లుల పెండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) హయాంలోనే వచ్చిందా? అంతకు ముందు నుంచి ఉందా? అనేది ముందుగా బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) చెప్పాలని కాంగ్రెస్ నేతలు (Congress Leaders) ప్రశ్నిస్తున్నారు. ఆ తరువాత పెండింగ్ బిల్లుల గురించి మాట్లాడాలని అంటున్నారు. అది సరే.. మరో ప్రశ్న కూడా వేస్తున్నారు. తెలంగాణ అనేది సంపన్న రాష్ట్రం. తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh) విడిపోయిన తర్వాత ఏపీ అప్పుల్లో ఉంటే.. తెలంగాణ మాత్రం సంపన్న రాష్ట్రాల జాబితాలో చేరింది. అలాంటి రాష్ట్రానికి గత పదేళ్లలో 1600 - 1800 కోట్ల బకాయిలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. అది తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బకాయిలు ఏమీ కాదు కదా అంటున్నారు. అసలు సంపన్న రాష్ట్రం అప్పుల ఊబిలో ఎలా కూరుకుపోయింది? ఎవరి తప్పిదమిది? అధికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా కాని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదమా? లేదంటే పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వా (BRS Government)నిదా? తప్పెవరిది? తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావే దీనికి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసి తమపై నెపం మోపడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఏం సమాధానం చెబుతారు?

మీరు చేస్తే సంసారమా?

ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయానికి వస్తే.. ఏదో సామెత చెప్పినట్టుగా ఉంది. తాము చేస్తే సంసారం.. ఎదుటోడు చేస్తే మరొకటి అన్నట్టుగా.. గతంలో లెజిస్లేటివ్ పార్టీ (Legislative Party)ని మర్జ్ చేసుకుంటామని చెబితే ఒప్పా? ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా పార్టీ మారితే తప్పా? ఇదెక్కడి న్యాయం? ఎన్నికలు రావని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆఫ్ ది రికార్డ్‌లో మాట్లాడితే దానిని కోర్టులో చెప్పి రచ్చ చేయడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ మీరు మాత్రం ముఖ్యమంత్రిని పట్టుకుని థర్డ్ రేటెడ్ అని మాట్లాడతారా? మరి మీరు ఏ రేటెడ్ అని ప్రశ్నిస్తున్నారు? సమాధానం చెప్పండి. అసలు ఇదంతా కాదు.. తెలంగాణ రావడానికి ముందు మీరెలా ఉన్నారు? ఇప్పుడు మీరెలా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు ఏం చెబుతారు? మీ ఆస్తుల విలువను తెలంగాణకు ముందు.. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు.. చెబుతారా? కేసీఆర్ కుటుంబంలోని వ్యక్తుల ఆస్తుల విలువ కొన్నిరెట్లు పెరిగిందని చెబుతున్నారు.. అది నిజం కాదంటారా? ప్రాజెక్టుల పేరిట వందల కోట్లు బీఆర్ఎస్ ముఖ్య నేతలు దోచేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. ఏం చెబుతారు? అందుకే విమర్శలు చేసేవారు.. ఒకసారి తమవైపు చూసుకోవాలని చెబుతారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 18, 2025 3:53 AM