Varanasi Glimpse: గ్లింప్స్‌లో చూపించిన అమ్మవారి వెనుక ఇంత కథుందా?
సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) ‘వారణాసి’ గ్లింప్స్ (Varanasi Glimpse) గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్లింప్స్ ప్రపంచాన్ని ఆకట్టుకుందనడంలో సందేహమే లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) ‘వారణాసి’ గ్లింప్స్ (Varanasi Glimpse) గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్లింప్స్ ప్రపంచాన్ని ఆకట్టుకుందనడంలో సందేహమే లేదు. శ్రీరాముడి (Mahesh as Lord Srirama) అవతారంలో మహేష్ కనిపించబోతున్నారని దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) చెప్పి అంచనాలను ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు గ్లింప్స్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లోని ఒక ఫ్రేమ్‌లో అమ్మవారిని చూపించడం జరుగుతుంది. ఆమె పేరు చిన్నమస్తాదేవి. ఆమె మరెవరో కాదు.. పార్వతీదేవి (Parvathi Devi). ఉగ్రభట్టి, వనాచల్ అనే ప్రాంతంలో ఓ గుహలో ఈ అమ్మవారు మనకు కనిపిస్తుంది. చిన్నమస్తాదేవి విగ్రహంపైన ఎరుపురంగులో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) మనకు కనిపిస్తుంది.
ఆమెను కాపాడేందుకు మహేష్ (Mahesh) గుహపై వేలాడుతూ కనిపిస్తారు. అసలు చిన్నమస్తాదేవి కథేటంటే.. చిన్నమస్తాదేవిని దశ మహావిద్యల్లో ఒక రూపంగా చెబుతారు. ఈ అమ్మవారు తన తలను తనే నరుక్కుని.. తన రక్తాన్ని తన తోటి ఇద్దరు దేవతలకు తాగిస్తూ.. తనూ సేవిస్తుంది. ఈ అమ్మవారి ఉగ్రరూపిణిగా దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని వజ్ర వైరోచనీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ దేవతను చింతపుర్ణీ దేవిగానూ కొలుచుకుంటారు. ఈ అమ్మవారి శక్తి ఎలాంటిదో తెలుసా? పరుశురాముడు, నరసింహావతారానికి సమానమైన శక్తి. ఆమె కాళ్ల కింద శృంగార విలాసంలో ఉన్న మన్మథుడు, రతీదేవి కనిపిస్తారు. అమ్మవారి కాళ్ల కింద మన్మథుడు, రతీదేవి ఎందుకున్నారు? దానికి వెనుకున్న కథేంటి? తెలుసుకుందాం.
పార్వతీదేవికి డాకినీ, వారాని. ఓ రోజు పార్వతీ దేవి.. తన పుత్రికలతో కలిసి స్నానానికి నదికి వెళ్లగా.. ఆ సమయంలో ఆమెలో కామవాంఛలతో పాటు ఆకలి వేస్తుంది. అప్పుడు పార్వతీదేవి తన కామవాంఛలతో పాటు ఆకలిని అణచివేసుకునేందుకు తన తలను తానే నరుక్కుని ఆ రుధిర ధారలను తను తాగుతూ తన కుమార్తెలకు పంచింది. అలా తన రక్తాన్ని తానే తాగి అమ్మవారు తనలోని భౌతిక వాంఛలను అణిచిపెట్టిందట. అలాంటి చిన్నమస్తాదేవిని సాధువులు, తాంత్రిక విద్యలను అభ్యసించేవాళ్లు కొలుస్తారు. అమ్మవారిని భక్తితోనే కాకుండా ముఖ్యంగా భయాన్ని గెలవాలనే ధైర్యం కోసం అమ్మవారిని కొలుస్తారు. అమ్మవారి కుమార్తెలైన డాకిని నల్లని కాళికా రూపంలో దర్శనమిస్తుంది. వారాణి ఎర్రగా శక్తి రూపంలో దర్శనమిస్తుంది.
వారాని, డాకినిలు ఒకరు కాలానికి.. మరొకరు శక్తికి ప్రతీకలు. ఇక ఛిన్నమస్తాదేవి నుంచి వచ్చే మూడు రక్తధారలు నాడీమండలంలోని ఇడా, పింగల, సుషుమ్న నాడులను సూచిస్తాయి. ఇక ‘వారణాసి’ గ్లింప్స్ విషయానికి వస్తే.. తేత్రా యుగంలో రాముడి కారణంగా కుంభకర్ణుడు చేతులు, కాళ్లు కోల్పోయాడు. ఆ సమయంలో తనకు శక్తి కోసం ఛిన్నమస్తాదేవిని కుంభకర్ణుడు పూజించాడని తెలుస్తోంది. మనకు గ్లింప్స్‌లో చూపించిన చిన్నమస్తాదేవి కథ ఇది. మరి ప్రియాంక అమ్మవారి విగ్రహంపై ఎందుకు ఉంటుందో తెలియడం లేదు. మొత్తానికి ఒక్క సన్నివేశం వెనుక ఇంత కథ ఉందన్నమాట.