Raj-Samantha: రాజ్-సమంత పెళ్లి పీటలు ఎక్కేది అప్పుడేనా?
టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) రూత్ ప్రభు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆమె చేస్తున్న ఒక పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాలలో పెద్ద చర్చకు దారి తీసింది.
టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) రూత్ ప్రభు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆమె చేస్తున్న ఒక పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాలలో పెద్ద చర్చకు దారి తీసింది. దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న తరుణంలో, సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో.. ఆ ప్రచారానికి బలం చేకూర్చడమే కాక, అభిమానులను ఇంకేదో ఉందన్న ఉత్కంఠకు గురి చేసింది. తాజాగా తన మూవీ పూజా కార్యక్రమాల్లో భాగంగా రాజ్ నిడిమోరుతో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె రాజ్‌తో చాలా సన్నిహితంగా, ఆత్మీయంగా ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలలో సమంత, రాజ్ నిడిమోరును కౌగిలించుకొని నవ్వుతూ కనిపించారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వగా, ఇది రాజ్‌తో తన బంధాన్ని ఆమె బహిరంగంగా ధృవీకరించినట్లు అయ్యిందని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి లోపు ఈ ఇద్దరూ పెళ్లి పీటలెక్కుతారని తెలుస్తున్నది.
నాడు.. నేడు!
గత కొద్ది రోజులుగా సమంత, దర్శకుడు రాజ్‌తో ప్రేమలో ఉన్నారన్న వార్తలు తెగ వినిపిస్తూ వచ్చాయి. రాజ్‌తో కలిసి సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి విజయవంతమైన వెబ్ సిరీస్‌లో పనిచేశారు. ఆ తర్వాత వారి బంధం స్నేహం కంటే ఎక్కువగా మారిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి ఉండే ఫోటోలను సమంత గతంలోనూ ఎన్నోసార్లు పంచుకున్నారు. కానీ, ఎప్పుడూ తమ ప్రేమ బంధం గురించి నేరుగా మాట్లాడలేదు. అయితే, ఈ తాజా ఫోటోల పరంపర మాత్రం వారిద్దరి బంధంపై వస్తున్న పుకార్లకు స్పష్టమైన సమాధానం ఇచ్చిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సమంత వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే ఆమె గతంలో అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్నారు. అయితే, మూడేళ్ల వివాహ జీవితం తరువాత, అభిప్రాయ భేదాల కారణంగా వారు విడిపోయారు. వారి విడాకులు దక్షిణాది సినీ పరిశ్రమలో పెద్ద సంచలనం సృష్టించాయి. విడిపోయిన తర్వాత, నాగచైతన్య నటి శోభితా ధూళిపాళతో ప్రేమాయణం, పెళ్లి కూడా జరిగిపోయింది.
అయిపాయ్..!
నాగచైతన్యతో విడిపోయిన తర్వాత తన దృష్టిని పూర్తిగా వృత్తిపరమైన జీవితంపైనే సమంత పెట్టారు. అరుదైన ఆరోగ్య సమస్య (మయోసైటిస్) నుంచి కోలుకుంటూనే వరుస ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో, రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు.. ఆమె అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. రాజ్‌తో సమంత షేర్ చేసిన ఈ సన్నిహిత ఫోటోలపై సోషల్ మీడియాలో చిత్రవిచిత్రాలుగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు మరియు నెటిజన్లు ఆశ్చర్యం, సంతోషం కలగలిపిన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు ‘మీరిద్దరూ కన్ఫర్మ్ చేసేశారు! ఇంకేముంది, ఇప్పుడు పెళ్లి ఒక్కటే కదా మిగిలింది!’ అని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు ‘ఇకపై ఆ బంధాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’ అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు. రాజ్‌తో సమంత ఎంత సంతోషంగా ఉందో ఈ ఫోటోలు చెబుతున్నాయని బాలీవుడ్ మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురిస్తోంది. మొత్తానికి, టాలీవుడ్, బాలీవుడ్ సినీ పరిశ్రమల మధ్య బంధాలను మరింత బలోపేతం చేస్తూ, ఈ ఇద్దరు ప్రముఖులు త్వరలోనే తమ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల