Rajiv Kanakala: మా అబ్బాయి లవ్ స్టోరీయా.. షాకైన రాజీవ్ కనకాల
మీ అబ్బాయి నడిపిన లవ్ ట్రాక్ అంతా.. మీరూ సుమగారు నడిపిన లవ్ ట్రాక్‌కు దగ్గరగా ఉందా?’ అని హోస్ట్ ప్రశ్నించగా‘ఏ అబ్బాయి?’ అంటూ రాజీవ్ బ్లాంక్ ఫేస్ పెట్టారు.

ప్రస్తుతం వెబ్ స్టోరీస్ (Web Stories), సినిమాలు (Movies) అనే తేడా లేకుండా ఎడాపెడా నటించేస్తున్నారు రాజీవ్ కనకాల (Rajiv Kanakala). ప్రస్తుతం ఆయన చేతిలో వెబ్ స్టోరీస్, సినిమాలు అన్నీ కలిపి పదికి పైనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇటీవలే ఆయన నటించిన ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) సినిమా విడుదలై మంచి సక్సెస్ సాధించింది. మౌళి తనూజ్ ప్రశాంత్ (Mouli Tanuj Prashanth), శివాని నగరం (Shivani Nagaram) జంటగా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల (Rajiv Kanakala) ఒక ముఖ్య పాత్ర పోషించారు. తాజాగా రాజీవ్ కనకాల ఓ యూట్యూబ్ ఛానల్ (Youtube Channel)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకు లవ్ స్టోరీ అడగ్గానే షాక్ అయ్యారు. గుండె జారీ గల్లంతయ్యిందని తెలిపారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం.
పిల్లలకు జనరేషన్ భేదం అంటూ ఏది లేదని.. ఏ జనరేషన్‌లో అయినా ‘లిటిల్ హార్ట్స్’ మూవీలో ఉన్నట్టుగానే ఉంటారని రాజీవ్ అన్నారు. తనకు కూడా సినిమా చేస్తుంటే ఆ ఏజ్‌లో చేసిన చిలిపి చేష్టలు గుర్తుకు వచ్చాయన్నారు. అప్పుడు హోస్ట్ ‘మీ అబ్బాయి నడిపిన లవ్ ట్రాక్ అంతా.. మీరూ సుమ (Anchor Suma)గారు నడిపిన లవ్ ట్రాక్‌కు దగ్గరగా ఉందా?’ అని ప్రశ్నించారు. అంతే రాజీవ్ షాక్ అయ్యారు. ‘ఏ అబ్బాయి?’ అంటూ బ్లాంక్ ఫేస్ పెట్టారు. అప్పుడు హోస్ట్ మీ అబ్బాయి అంటే రోషణ్ కనకాల (Roshan Kanakala) కాదు.. లిటిల్ హార్ట్స్ సినిమాలోని అబ్బాయి మౌళి (Mouli Tanuj) గురించి అనగానే.. కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ‘ఇదేంటి ఇప్పుడు చెబుతున్నారు.. ఈయనకేం తెలిసింది.. ఏం నడిపాడు?’ అని అనుకున్నానని రాజీవ్ చెప్పారు.
ప్రజావాణి చీదిరాల