Entertainment

Beauty Movie Review: టైటిల్‌లోని ‘బ్యూటీ’ సినిమాలో ఉందా?

మనిషి జీవితంలో వివిధ దశలు ఉంటాయి. వాటిలో 12 - 18 సంవత్సరాల వయసును అడాలసెన్స్‌గా పిలుస్తారు. ముఖ్యంగా ఈ వయసులో ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఈ దశను దాటితే ఇబ్బంది ఉండదు.

Beauty Movie Review: టైటిల్‌లోని ‘బ్యూటీ’ సినిమాలో ఉందా?

మనిషి జీవితంలో వివిధ దశలు ఉంటాయి. వాటిలో 12 - 18 సంవత్సరాల వయసును అడాలసెన్స్‌గా పిలుస్తారు. ముఖ్యంగా ఈ వయసులో ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఈ దశను దాటితే ఇబ్బంది ఉండదు. కానీ దాటే క్రమంలో తల్లిదండ్రులు పిల్లలను కాచుకుని ఉండాలి. లేదంటే తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. ఈ పాయింట్ ఆధారంగా రూపొందిందే ‘బ్యూటీ’ చిత్రం. ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ ఇచ్చిన స్పీచ్‌లకు అంచనాలైతే భారీగానే పెరిగాయి. మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా..? చూద్దాం.

కథేంటంటే..

వైజాగ్‌కు చెందిన నారాయణ (నరేష్), ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ రెక్కల కష్టంపై కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. ఆయన కూతురు అలేఖ్య (నీలఖి పాత్ర) చాలా అందంగా ఉంటుంది. తనొక ఏంజెల్ అని ఫీలవుతూ ఉంటుంది. వైజాగ్‌లో ఇంటర్ చదువుతూ ఉంటుంది. ఆమెకు బైక్ కొనుక్కోవాలని కోరిక. తండ్రి తన బర్త్‌డేకి బండి గిఫ్ట్‌గా ఇస్తాననడంలో డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమెకు అర్జున్ (అంకిత్ కొయ్య) పరిచయమవుతాడు. అతడొక పెట్ లవర్ / ట్రైనర్. అలేఖ్యకు బండి నేర్పిస్తాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. అర్జున్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ.. తల్లి కంట పడుతుంది. ఇక తనను తల్లిదండ్రులు ఏం చేస్తారోననే భయంతో అర్జున్‌ను ఒప్పించి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇద్దరూ కలిసి హైదరాబాద్ వస్తారు. అక్కడి నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. హైదరాబాద్ వచ్చాక ఏం జరిగింది? అర్జున్, అలేఖ్య ప్రేమ ఏ మలుపు తీసుకుంది? వీరిద్దరూ వివాహం చేసుకున్నారా? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

ఒక సోషల్ మెసేజ్‌తో కూడిన కథలు చాలానే వస్తున్నాయి కానీ ఇటీవలి కాలంలో ఇలాంటి కథలు చాలా తక్కువనే చెప్పాలి. కూతురే ప్రాణంగా బతికే తండ్రి.. ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోని కూతురు.. ఈ తరహా కథలు నిత్య జీవితంలో వింటూనే ఉంటాం. ప్రస్తుత సమాజం ఎలా ఉంది? ఆడపిల్లను ఎంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాలను దర్శకుడు కళ్లకు కట్టాడు. తొలి అర్థ భాగమంతా ఒక మధ్య తరగతి కుటుంబం.. దానిలోని అమ్మాయి.. ఆమె ఆశలు.. ఆమె అమాయకత్వం.. కూతురి ఆశను తీర్చలేని తండ్రి నిస్సహాయత.. అమ్మాయి ప్రేమలో పడటం వంటి అంశాలతో రూపొందింది. సెకండాఫ్‌లో అసలు కథ ప్రారంభమవుతుంది. తొలి అర్థభాగం కొంతమేర సాగదీత కనిపిస్తుంది. రెండవ భాగం ఒక షాకింగ్ ట్విస్ట్‌తో రూపొందించారు. సినిమా అయితే సాగదీతలు లేకుంటే సినిమా ఇంకా బాగుండేది.

ఎవరెలా చేశారంటే..

'అలేఖ్య' గా 'నీలఖి పాత్ర' నేటి తరం అమ్మాయిలను కళ్లకు కడుతుంది. అంకిత్ కొయ్య అద్భుతంగా నటించాడు. తన పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాకు హీరో నరేష్ అని చెప్పాలి. ఒక మధ్యతరగతి తండ్రి పాత్రలో ఆయన జీవించారు. వాసుకి తల్లిగా తన అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఇక సీఐ అన్వర్‌గా మలయాళ నటుడు నితిన్ ప్రసన్న మెస్మరైజ్ చేశారని చెప్పాలి. దర్శకుడిగా వర్థన్ సినిమాను అన్ని విధాలుగా అందంగా మలచడంలో సక్సెస్ అయ్యారు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ఒక ప్లస్ అని చెప్పాలి. విజయపాల్ రెడ్డి ఎక్కడా వెనుకడుగు వేయకుండా సినిమాను నిర్మించినట్టు నిర్మాణ విలువలు చూస్తుంటేనే అర్థమవుతుంది. స్క్రీన్‌ప్లే కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి.

ఫైనల్‌గా.. టీనేజ్ యువత, ఆడపిల్ల తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇది..

రేటింగ్: 3/5

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 18, 2025 2:15 PM