Vishwaksen: ‘ఫంకీ’ ప్రేక్షకులకు ఫన్ ఇచ్చిందా?
కేవీ అనుదీప్ సినిమా వస్తోందంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. ‘జాతిరత్నాలు’ చిత్రం తర్వాత ఆయన ఫ్లాప్ పొంది ఉండొచ్చు. కానీ ‘జాతిరత్నాలు’ మిగిల్చిన క్రేజ్ కావొచ్చు.. ఆ తరువాత బుల్లితెరపై కొన్ని షోలలో కనిపించి తనకంటూ ఓ క్రేజ్‌కావొచ్చు.
చిత్రం: ఫంకీ
విడుదల: 13-02-2026
నటీనటులు: విశ్వక్‌సేన్, కయాదు లోహర్, నరేశ్, సంపత్ రాజ్ తదితరులు
దర్శకత్వం: కేవీ అనుదీప్
నిర్మాత: నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటింగ్: నవీన్ నూలి సినిమాటోగ్రఫీ: సురేశ్ సారంగం
కేవీ అనుదీప్ సినిమా వస్తోందంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. ‘జాతిరత్నాలు’ చిత్రం తర్వాత ఆయన ఫ్లాప్ పొంది ఉండొచ్చు. కానీ ‘జాతిరత్నాలు’ మిగిల్చిన క్రేజ్ కావొచ్చు.. ఆ తరువాత బుల్లితెరపై కొన్ని షోలలో కనిపించి తనకంటూ ఓ క్రేజ్‌ను సంపాదించుకోవడంతో అనుదీప్ సినిమా వస్తోందంటేనే ప్రేక్షకులు దానిపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. మరి ఆ అంచనాలను నేడు వచ్చిన ‘ఫంకీ’ అందుకుందా? చూద్దాం.
కథేంటంటే..
భావోద్వేగాలు అనేది ప్రతి మనిషిలోనూ ఉంటాయి. కానీ కొందరు దానిని ఎక్స్‌ప్రెస్ చేయరు. అలాంటి వ్యక్తే కోమల్ (విష్వక్‌సేన్). ఆయనొక కొత్త దర్శకుడు. మంచి ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థలో అవకాశం అందుకుని రూ. 4 కోట్లలో పూర్తి చేస్తానని చెప్పి ‘ఫంకీ’ సినిమాని మొదలు పెడతాడు. కానీ ఆ బడ్జెట్ రూ.40 కోట్లకు చేరుతుంది. అయినా కూడా సినిమా పూర్తి కాదు. దీంతో మంచి ప్రొడక్షన్స్ నిర్మాత (నరేశ్) ఒత్తిడికి గురై ఆసుపత్రి పాలవుతారు. అది తెలుసుకున్న నిర్మాత కూతురు చిత్ర (కయాదు లోహార్) సినిమా బాధ్యతల్ని తీసుకుని ఆగిపోయిన సినిమాని మళ్లీ ప్రారంభిస్తుంది. రూ.కోటితో సినిమా పూర్తి చేయాలన్న కండీషన్‌తో కోమల్‌ను తిరిగి దర్శకత్వం చేసేందుకు అంగీకరిస్తుంది. మరి అనుకున్న బడ్జెట్‌లోనే కోమల్‌తో సినిమాని పూర్తి చేశాడా? కోమల్, చిత్రల కథ ఏ మలుపు తీసుకుంది? వంటి అంశాలను వెండితెరపై చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
సినిమాలో కథ కంటే నవ్వులే కీలకమని చెప్పి ముందుగానే నిర్మాత నాగవంశీ చెప్పడంతో అనుదీప్ మార్క్ కామెడీని ప్రేక్షకులు ఊహించుకున్నారు. నాగవంశీ చెప్పినట్టుగానే సినిమాలో ఆకట్టుకునే కథేమీ ఉండదు. పోనీ ‘జాతిరత్నాలు’ మార్క్ కామెడీ అయినా ఉంటుందా? అంటే అది కూడా లేదనే చెప్పాలి. కథ కూడా సినిమా రంగంతో ముడిపడి ఉంది కాబట్టి ఎంతో కొంత ఆకట్టుకుంటుందంటే పప్పులో కాలేసినట్టే. సంభాషణలు కొంతమేర యూత్‌ను మెప్పించవచ్చేమో. వాస్తవానికి అనుదీప్ బుల్లితెరపై చేసే సందడి మాదిరిగా కూడా సినిమా లేదు. ఇక గెస్ట్ అప్పియరెన్స్‌లకు కొదువే లేదు. నాగవంశీ, దిల్ రాజు వంటి నిర్మాతలతో పాటు ప్రముఖ దర్శకులు సైతం కనిపిస్తారు. వాస్తవానికి ఒకరిద్దరు మినహా వీరెవ్వరూ సినిమాకు పెద్దగా అవసరం లేదనే చెప్పాలి. ఏదో వీరంతా కనిపిస్తే బాగుంటుందేమో అన్న భావన మినహా ప్రయోజనమైతే లేదు. సినిమాలో హీరోకు తన బంధువులెవరో కూడా తెలియదు. ఇదంతా ఏమాత్రం మంచిగా అనిపించదు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే సినిమాకు గ్లామర్ కావాలి కాబట్టి పెట్టినట్టే ఉంది. కనీసం హీరోయిన్ పాత్ర కథపై పెద్దగా ప్రభావం చూపించదు. ఓవరాల్‌గా ఈ చిత్రంలో రెండు, మూడు పాత్రలకే ప్రాధాన్యత. సినిమా మొత్తం అనుదీప్ మార్క్ సంభాషణలప
ఎవరెలా చేశారంటే..
విశ్వక్‌సేన్ తన పాత్రలో జీవించాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పటి వరకూ విశ్వక్‌సేన్ చేసిన చిత్రాలకు ఇది భిన్నమైనది. అయినా కూడా చక్కగా పాత్రలో ఒదిగిపోయాడు. అయితే సినిమాలో ఇద్దరు విశ్వక్‌సేన్‌లను చూడవచ్చు. కొన్ని చోట్ల స్లిమ్ అయిపోయిన విశ్వక్‌సేన్. కొన్ని సన్నివేశాల్లో ఎప్పటిలా బొద్దుగానే కనిపిస్తాడు. కథానాయిక కయాదు లోహార్ తన అందంతో మెప్పిస్తుంది. నరేశ్ పాత్ర మినహా మిగిలిన పాత్రలన్నింటికీ పెద్దగా ప్రాధాన్యమే లేదు. భీమ్స్ స్వరపరిచిన పాటల్లో ఒకటి మినహా అన్నీ ఆకట్టుకున్నాయి. విజువల్స్ నాణ్యంగా ఉన్నా కూడా.. ఎడిటింగ్ దెబ్బకొట్టింది.
ఫైనల్‌గా.. అనుదీప్ కామెడీ పెద్దగా మెప్పించలేకపోయింది.
రేటింగ్: 2.5/5
ప్రజావాణి చీదిరాల