Entertainment

Peddi: ‘పెద్ది’ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. సోలోగా వచ్చి షేక్ చేస్తుందట..

‘పెద్ది’ సినిమా రిలీజ్ (Peddi Release) గురించి ఆసక్తికర టాక్ నడుస్తోంది. బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమంటూ దానికి గల కారణం సైతం ప్రచారం జరుగుతోంది.

Peddi: ‘పెద్ది’ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. సోలోగా వచ్చి షేక్ చేస్తుందట..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). బుచ్చిబాబు సాన (Butchibabu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ (Peddi Release) గురించి ఆసక్తికర టాక్ నడుస్తోంది. బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమంటూ దానికి గల కారణం సైతం ప్రచారం జరుగుతోంది. అదేంటో తెలుసుకుందాం. కొంతకాలం క్రితం విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియా (Social Media)ను షేక్ చేసింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఊరమాస్ గెటప్‌లో కనిపించాడు. ‘రంగస్థలం’ చిత్రంలో రామ్ చరణ్ ఎలా కనిపించాడో.. ఈ చిత్రంలోనూ అంతే ఊర మాస్ గెటప్‌లో కనిపిస్తూ ఉండటంతో సినిమా ‘రంగస్థలం’ (Rangastalam)ను మించి ఉండబోతోందంటూ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం శ్రీలంకలో షూటింగ్ జరుపుకుంటోంది.

వారం రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో భాగంగా రామ్ చరణ్ (Ram charan) – జాన్వీ కపూర్‌ (Janhvi kapoor)లపై లవ్ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ పాట కోసం జాన్వీ కపూర్, రామ్ చరణ్ స్పెషల్ ఫ్లైట్‌లో శ్రీలంకలో ల్యాండ్ అయిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ గురించి జరుగుతున్న ఆసక్తికర ప్రచారం ఏంటో తెలుసుకుందాం. వచ్చే ఏడాది.. ఉగాది, రంజాన్ వీకెండ్స్‌కు ముందుగా అన్ని ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ‘ప్యారడైజ్’ (Paradise) చిత్రం కూడా మార్చి 26 డేట్ ప్రకటించి ఎందుకోగానీ వాయిదా పడింది. ఈ రకంగా చూస్తే ‘పెద్ది’ శ్రీరామనవమి (Sriramanavami) సందర్భంగా సోలోగా విడుదల కానుంది.

ఇప్పటికే సినిమాపై మంచి టాక్ ఉంది. ఈ చిత్రం సోలోగా విడుదలవుతోంది కాబట్టి మార్చి, ఏప్రిల్ నెలల్లో వచ్చే సెలవులను పూర్తిగా వినియోగించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందనడంలో సందేహం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్‌లో చరణ్ లుక్, సిగ్నేచర్ షాట్ ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పించేదిగా ఉంది. ఈ సినిమా నుంచి గ్లింప్స్ తర్వాత ఎలాంటి అప్‌డేట్ అయితే రాలేదు కానీ నవంబర్ 8న మాత్రం ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందంటూ ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించి స్వయంగా ఏఆర్ రెహమాన్ (AR Rahman) దీనికి హాజరై ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తారట. ఇక ‘పెద్ది’ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 30, 2025 10:46 AM