Varun Tej: వరుణ్ తేజ్ తన కుమారుడికి ఏం పేరు పెట్టాడో తెలిస్తే..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) దంపతులకు బాబు పుట్టిన విషయం తెలిసిందే. ఈ బాబుకు ఏం పేరు పెట్టారో ఇవాళ వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) దంపతులకు బాబు పుట్టిన విషయం తెలిసిందే. ఈ బాబుకు ఏం పేరు పెట్టారో ఇవాళ వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. సెప్టెంబర్ 10న వరుణ్ తేజ్ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. అయితే తాజాగా చిన్నారికి బారసాల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ దంపతులు దసరా (Dassehra) పర్వదినం సందర్భంగా కుమారుడి పేరును సోషల్ మీడియా (Social Media) వేదికగా వెల్లడించారు. మెగా ఫ్యామిలీ ఆంజనేయ స్వామి (Anjaneya Swamy)ని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తుందన్న విషయం తెలిసిందే.
తమకు హనుమంతుడి (Lord Hanuman) దయతోనే బాబు పుట్టినట్టు వరుణ్ తేజ్ (Varun Tej) సైతం వెల్లడించాడు. ఈక్రమంలోనే పుట్టిన బాబుకు వాయువ్ తేజ్ (Vayuv Tej Konidela) అని నామకరణం చేసినట్టుగా వెల్లడించారు. అలాగే బాబుకు మీ అందరి దీవెనలూ కావాలంటూ కొన్ని ఫోటోలను వరుణ్ తేజ్ దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 2017లో ‘మిస్టర్’ (Mr) సినిమాలో వరుణ్, లావణ్య జంటగా నటించారు. ఆ సినిమాతో పరిచయం కాస్త స్నేహంగానూ.. ఆపై ప్రేమగానూ మారింది. ఈ జంట ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కానీ వేదికగా వివాహబంధంతో ఒక్కటైంది.