Rakasa: 10 రోజుల్లో ‘రాకాస’ ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే..
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా రూపొందిన చిత్రం ‘రాకాస’. ఈ చిత్రం విడుదలై మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే అదిరిపోయే వసూళ్లను సాధించింది. సినిమా మంచి ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో మంచి వసూళ్లను రాబడుతోంది.
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా రూపొందిన చిత్రం ‘రాకాస’. ఈ చిత్రం విడుదలై మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే అదిరిపోయే వసూళ్లను సాధించింది. సినిమా మంచి ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ రోజుల్లో ఒక సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ రావడమనేది చాలా అరుదు. ఓటీటీల కాలం కావడంతో ఒక్కసారి థియేటర్‌కు రావడమే కష్టం. అలాంటిది ఈ సినిమాకు ప్రేక్షకులు సోలోగా.. ఆ తరువాత కుటుంబంతో కలిసి వస్తున్నారు. డైరెక్టర్ మానస శర్మ ఈ చిత్రాన్ని ‘రాకాస’ సినిమా అందరికీ సులభంగా అర్థమయ్యేలా వినోదాత్మక చిత్రంగా రూపొందించారు. దీంతో అన్ని వయసుల వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా వసూళ్లపై మంచి ప్రభావాన్ని చూపిస్తోంది.
‘రాకాస’ చిత్రం 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.22.60 కోట్ల వసూళ్లను సాధించింది. డిఫరెట్ ప్రమోషనల్ స్ట్రాటజీ, మౌత్ టాక్ కూడా తోడు కావటంతో పాటు ఏప్రిల్ 10 నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 ఫ్లాట్ టికెట్ ధరను మేకర్స్ ప్రవేశపెట్టారు. దీంతో సినిమా మధ్యతరగతి వర్గానికి బాగా చేరువైంది. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పటికీ ఎక్కువ వసూళ్లను సాధిస్తున్నాయి. ఈ చిత్రాన్ని జీస్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మించారు గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు.