Samantha: మంచి కోడలికి ఉదాహరణ అనుకుంటే.. సమంత ఇలా చేసిందేంటి?
శారీలో సమంత అదరగొట్టేలా ఫైట్స్ చేసింది. ఇక అత్తింట్లో మాత్రం కోడలంటే అలా ఉండాలి అనిపించుకున్న సమంత మరో యాంగిల్‌లో ఊర మాస్ అవతార్‌లో కనిపించింది.
పెళ్లి తర్వాత స్టార్ హీరోయిన్ సమంతకు కాలం బాగా కలిసొస్తున్నట్టుగా ఉంది. పెళ్లైన వెంటనే ‘మా ఇంటి బంగారం’ను లైన్‌లో పెట్టేసింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా ఈ మూవీ టీజర్ ట్రైలర్‌ను సైతం మేకర్స్ వదిలారు. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోందని టీజర్‌ని బట్టి తెలుస్తోంది. ఈ చిత్రంలో సమంత పూర్తిగా శారీలో చాలా అందంగా కనిపించినప్పటికీ.. అలాగే యాక్షన్ సీన్స్‌లో పాల్గొనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకోగాని సమంత యాక్షన్ ప్రాజెక్టుల వైపే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో వచ్చిన ఆమె వెబ్ సిరీస్‌లు ‘ది ఫ్యామిలీ మాన్ 2’, ‘సిటాడెల్’లోనూ సామ్ యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించింది.
శారీలో సమంత అదరగొట్టేలా ఫైట్స్ చేసింది. ఇక అత్తింట్లో మాత్రం కోడలంటే అలా ఉండాలి అనిపించుకున్న సమంత మరో యాంగిల్‌లో ఊర మాస్ అవతార్‌లో కనిపించింది. టీజర్‌లో చివరిలో ‘మంచి కోడలు ఎలా ఉండాలో వదినను చూసి నేర్చుకో’మంటూ నటి శ్రీలక్ష్మి సలహా ఇస్తుండగా.. మరోవైపు సమంత ఒకరిని హత్య చేసి లాక్కెళుతూ ఉంటుంది. మొత్తానికి టీజర్ అయితే ఆసక్తికరంగానే ఉంది. టైటిల్ చూసేందుకు ఫ్యామిలీ టచ్‌తో పాటు సినిమా మాత్రం పూర్తి స్థాయిలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రం సమంత సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై రాజ్ నిడుమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘కాంతారా ఛాప్టర్ 1’ ఫేమ్ గుల్షన్ దేవయ్య, కన్నడ స్టార్ హీరో దిగంత్‌లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.