Jr NTR: ఎన్టీఆర్ ఫోటోలు, వీడియోలను ఇకపై తప్పుగా వినియోగించారో..
సోషల్ మీడియా (Social Media), కమర్షియల్ వెబ్‌సైట్‌లలో చేస్తున్న పోస్టుల కారణంగా తన వ్యక్తిగత హక్కులు దెబ్బతింటున్నాయని.. కాబట్టి తన వ్యక్తిగత హక్కుల రక్షణ కోరతూ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.
సోషల్ మీడియా (Social Media), కమర్షియల్ వెబ్‌సైట్‌లలో చేస్తున్న పోస్టుల కారణంగా తన వ్యక్తిగత హక్కులు దెబ్బతింటున్నాయని.. కాబట్టి తన వ్యక్తిగత హక్కుల రక్షణ కోరతూ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఎన్టీఆర్‌కు అనుకూలంగా ఉత్తర్వులను జారీ చేసింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. నేటి డిజిటల్ యుగంలో తన వ్యక్తిత్వ హక్కులను కాపాడే రక్షణాత్మక ఉత్తర్వును మంజూరు చేసినందుకు ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కేసులో తనకు మద్దతుగా నిలిచిన సుప్రీంకోర్టు న్యాయవాదులు డాక్టర్ బాలజానకి శ్రీనివాసన్, డాక్టర్ అల్కా డాకర్, రాజేందర్, రైట్స్ అండ్ మార్క్స్ టీంకి హృదయపూర్వక కృతజ్ఞతలను జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు.
ఈ పిటిషన్లపై జస్టిస్ మన్‌ప్రీత్ ప్రీతమ్ సింగ్ అరోడా విచారణ జరిపారు. వాణిజ్య అవసరాలతో పాటు తప్పుడు ప్రచారం కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan), జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఫొటోలు, వీడియోలు వాడుతున్నారు. దీంతో వీరిద్దరూ వేర్వేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తున్నందున వాటిని అడ్డుకోవాలని పవన్, ఎన్టీఆర్ తరఫున సాయి దీపక్ వాదనలు వినిపించారు. తప్పుడు సమాచారం, మార్ఫింగ్ ఫోటోలతో పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు.. ఫ్లిప్‌క్టార్, అమెజాన్, ఎక్స్, గూగుల్ వేదికల్లో ఉన్న ఇలాంటి పోస్టులను సైతం తొలగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును ఎన్టీఆర్ కోరాడు. ఇక మీదట ఎన్టీఆర్ ఫోటోలను కానీ.. వీడియోలను కానీ తప్పుగా వినియోగిస్తే వారికి ఇబ్బందులు తప్పవు.