Entertainment

iBOMMA Warning: ఐ బొమ్మ మీద ఫోకస్ చేశారో.. మేము ఎక్కడ చేయాలో అక్కడ చేస్తాం..

ఐ బొమ్మ (iBOMMA) మీద ఫోకస్ చేస్తే తాము ఎక్కడ చేయాలో అక్కడ చేస్తామంటూ పోలీసులు, సినీ నిర్మాతలకు ఐబొమ్మ నిర్వాహకులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

iBOMMA Warning: ఐ బొమ్మ మీద ఫోకస్ చేశారో.. మేము ఎక్కడ చేయాలో అక్కడ చేస్తాం..

ఐ బొమ్మ (iBOMMA) మీద ఫోకస్ చేస్తే తాము ఎక్కడ చేయాలో అక్కడ చేస్తామంటూ పోలీసులు, సినీ నిర్మాతలకు ఐబొమ్మ నిర్వాహకులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొన్ని ప్రశ్నలను సినీ నిర్మాతల (Movie Producers)కు సదరు వ్యక్తులు వదిలారు. డిస్ట్రిబ్యూటర్స్‌ (Movie Distributors)కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా తమపై ఫోకస్ ఎందుకు పెట్టారని నిలదీశారు. మీ ఓటీటీ (OTT) రెవెన్యూ కోసం ఇలా చేస్తున్నారని ఆరోపించారు. హీరో మీ కొడుకైనా కావచ్చు.. మరొకరైనా కావొచ్చు.. అంత రెమ్యూనరేషన్ అవసరమా? అని ప్రశ్నించారు.

సినీ ఇండస్ట్రీ (Cine Industry)లో చాలా మంది ఉన్నారని.. వాళ్లు ఏమైపోతారని కబుర్లు చెప్పవద్దంటూ నిర్మాతలకు హితవు పలికారు. ఇండస్ట్రీలో పని చేసే వారికి ఏ కూలి పని చేసుకున్న మీరిచే అమౌంట్ వస్తుందని కానీ హీరో (Movie Hero), హీరోయిన్లు (Movie Heroins) కూలి మందమే తీసుకుంటున్నారా? అన్నట్టుగా ఐబొమ్మ నిర్వాహకులు ప్రశ్నించారు. సినిమా బడ్జెట్‌ (Movie Budget)లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్, విదేశాల్లో షూటింగ్‌, ట్రిప్స్ కోసం ఖర్చు పెడుతూ ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకూ ప్రతి ఒక్కరినీ ఉద్దరిస్తున్నట్టు కబుర్లు చెబుతున్నారన్నట్టుగా ఐబొమ్మ నిర్వాహకులు పేర్కొన్నారు.

ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ (Movie Budget) అంత అవదు పైగా ఉపాధి కూడా కలుగుతుందని చెప్పారు. అసవసర బడ్జెట్ పెట్టి ఎక్కువ రేటుకు అమ్ముతుండటంతో ఆ డబ్బు రాబట్టుకునేందుకు డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్ (Theatre Owners) టికెట్ రేటు పెంచుతున్నారని అన్నారు. చివరకు మధ్య తరగతి వాడు బాధపడుతున్నాడని పేర్కొన్నారు. తమ వెబ్‌సైట్‌ (Ibomma Website)పై ఫోకస్ చేయడం ఆపకుంటే తాను మీపై ఫోకస్ చేయాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. మీ యాక్షన్‌కి తప్పక తమ రియాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్యలో వేరే హీరో (ఉదాహరణకు విజయ్) (Hero Vijay) టార్గెట్ అవడం తమకు ఇష్టం లేదని తెలిపారు. ఇక చివరిలో చావుకు భయపడని వాడు దేనికీ భయపడటంటూ స్ట్రాంగ్ స్టేట్‌మెంటే ఇచ్చారు.

ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా వీసీ సజ్జనార్ (VC Sajjanar) బాధ్యతలు స్వీకరించారు. వచ్చీ రాగానే ఆయన పైరసీ భూతానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే ఐబొమ్మ నిర్వాహకులు తమ జోలికి వస్తే బొమ్మ చూపిస్తామంటూ సవాల్ విసిరారు. పైగా చావుకు భయపడని వాడు దేనికి భయపడడంటూ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. ఈ నేపథ్యంలో సజ్జనార్ ఏ స్టెప్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆర్టీసీని వీడి సీపీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయనకు పెను సవాలే ఎదురైంది. మరి దీనిపై ఆయనెలా స్పందిస్తారో చూడాలి.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 1, 2025 1:53 PM