Entertainment

IBomma: పోలీసులకే సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్

ప్రముఖ ఆన్‌లైన్ సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) నిర్వాహకుల్లో కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు Cyber Crime Police) తాజాగా అరెస్ట్ చేశారు.

IBomma: పోలీసులకే సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్

ప్రముఖ ఆన్‌లైన్ సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) నిర్వాహకుల్లో కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు Cyber Crime Police) తాజాగా అరెస్ట్ చేశారు. తన వెబ్‌సైట్‌పై దృష్టి పెడితే సినీ పరిశ్రమతో పాటు పోలీసు అధికారులు, హీరోల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సీక్రెట్‌లను బయటపెడతానంటూ గతంలో రవి బహిరంగ హెచ్చరికలకు దిగిన విషయం తెలిసిందే. గురువారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడిని సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా సమాచారంతో కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. రవి ఐబొమ్మ వెబ్‌సైట్‌ను కరేబియన్ దీవుల్లో ఉంటూ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

రవి అరెస్ట్ అయిన తక్షణమే అతని అకౌంట్లో ఉన్న రూ.3 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఐబొమ్మపై గతంలో తెలుగు ఫిల్మ్‌ యాంటీ పైరసీ టీమ్‌ (Telugu Film Anty Piracy Team) పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలుగు సినిమాలను పైరసీ చేస్తూ తమకు నష్టం కలుగజేస్తోందని ఫిర్యాదులో టీం పేర్కొంది. ఆ సమయంలో ఐబొమ్మ నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసరగా.. దానిని సైబర్ క్రైమ్ సవాలుగా తీసుకుంది. గతంలోనూ ఈ వెబ్‌సైట్ కోసం పని చేస్తున్న ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పుడు ఏకంగా నిర్వహకుడినే అరెస్ట్ చేశారు. ఇమ్మడి రవిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆరు నెలలుగా గాలిస్తున్నారు. ఇంత కాలానికి అతడిని అరెస్ట్ చేశారు. ఐబొమ్మ వెబ్‌సైట్ కారణంగా సినీ పరిశ్రమకు వేల కోట్లలో నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.

ఓటీటీల్లో విడుదలైన కొత్త చిత్రాలతో పాటు.. థియేటర్లలో విడుదలైన హెచ్‌డీ ప్రింట్లను సైతం ఈ వెబ్‌సైట్ అక్రమంగా పైరసీ చేసి ఉచితంగా అందించడంతో ప్రేక్షకులు లక్షల సంఖ్యలో ఈ వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో థియేటర్లకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్‌ యాంటీ పైరసీ టీమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఐబొమ్మ నిర్వాహకుడు రవి.. సినీ ఇండస్ట్రీతో పాటు పోలీసులకు సైతం సవాలు చేశాడు. దీంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆరు నెలల పాటు గాలింపులు నిర్వహించిన మీదట.. నేడు పక్కా సమాచారంతో రవిని అదుపులోకి తీసుకున్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 15, 2025 5:57 AM