Dhruv Vikram: ‘బైసన్’ కోసం మూడేళ్లు కష్టపడ్డా.. నచ్చితే సపోర్ట్ చేయండి..
కొద్ది రోజుల క్రితం షాపింగ్ చేసేందుకు హైదరాబాద్ వచ్చానని.. ఓ షాప్ ఓనర్ తనను చూసి ‘మీరు విక్రమ్ (Chiyan Vikram)లా ఉన్నారు’ అని అన్నారని తెలిపాడు. అప్పుడు తాను విక్రమ్ కుమారుడినేనని చెప్పానని తెలిపాడు.

ధృవ్ విక్రమ్ (Dhruv Vikram), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా రూపొందిన చిత్రం ‘బైసన్’ (Byson). మారి సెల్వరాజ్ (Mari Selvaraj) రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 24న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో జగదంబే ఫిల్మ్స్ బ్యానర్ (Jagadambe Films Banner)పై విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం (అక్టోబర్ 21) హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. దీనిలో ధృవ్, అనుపమ తదితరులు పాల్గొని చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా హీరో ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ .. తాను తొలిసారిగా ‘బైసన్’ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చానని తెలిపాడు. తనకు ‘బైసన్’ ఎంతో ప్రత్యేకమని వెల్లడించాడు. కొద్ది రోజుల క్రితం షాపింగ్ చేసేందుకు హైదరాబాద్ వచ్చానని.. ఓ షాప్ ఓనర్ తనను చూసి ‘మీరు విక్రమ్ (Chiyan Vikram)లా ఉన్నారు’ అని అన్నారని తెలిపాడు. అప్పుడు తాను విక్రమ్ కుమారుడినేనని చెప్పానని తెలిపాడు. తన తండ్రి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఈ స్థాయికి ఎదిగారని.. కానీ తనకు మాత్రం ఆయన కొడుకుగా అన్నీ సులభంగానే అందాయని వెల్లడించారు. తను కూడా ఆయన మాదిరిగానే అందరి ప్రేమను సంపాదించేందుకు చాలా కష్టపడతానని ధృవ్ తెలిపాడు. తనకు తెలుగులో నటించాలని ఉందని వెల్లడించాడు. ‘బైసన్’ కోసం మూడేళ్లు కష్టపడ్డానని.. మూవీ చూసి నచ్చితే సపోర్ట్ చేయాలని కోరాడు.
అనుపమ పరమేశ్వరణ్ మాట్లాడుతూ.. మారి సెల్వరాజ్ తొలి చిత్రంలోనే తాను కూడా నటించాల్సి ఉందని... కానీ అప్పుడు తాను బిజీగా ఉండటం వల్ల కుదరలేదని తెలిపింది. ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక ‘బైసన్’తో తీరిపోయిందని వెల్లడించింది. ఈ మూవీతో తాను చాలా నేర్చుకున్నానని అనుపమ తెలిపింది. తమిళంలో ఆల్రెడీ ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కడంతో తెలుగులో రిలీజ్ చేయాలనే డిమాండ్ పెరిగిందని.. అందుకే మేం అక్టోబర్ 24న తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నామని పేర్కొంది. ధృవ్‌కి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉందని, ఎంతో కష్టపడ్డాడని రిలీజ్‌కు ముందు చెప్పిన మాటలనే ఇప్పుడు కూడా చెబుతున్నట్టు అనుపమ తెలిపింది.
నిర్మాత వీపీ సెల్వన్ బాలాజీ మాట్లాడుతూ .. ‘‘బైసన్’ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉందని.. ఇది లింగుస్వామి, నా సోదరుడు చంద్రబోస్ వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ మూవీని చూశాక.. తెలుగు ఆడియెన్స్‌కి తప్పక కనెక్ట్ అవుతుందన్న నమ్మకం తనకు ఏర్పడిందన్నారు. ధృవ్ ఎంత కష్టపడ్డాడన్నది సినిమా చూస్తే అర్థం అవుతుందని.. అనుపమ సైతం అందరినీ ఆకట్టుకుంటుందని సెల్వన్ బాలాజీ పేర్కొన్నారు.
ప్రజావాణి చీదిరాల