Pawan Kalyan: నిన్ను నేలకు దించుతా.. పవన్ వార్నింగ్
సినిమాల్లో వేసుకునే కాస్ట్యూమ్స్‌తో తానెప్పుడూ ఎలాంటి వేడుకకూ హాజరు కాలేదని.. డైరెక్టర్ సుజీత్ కారణంగా తానిలా రావాల్సి వచ్చిందన్నారు.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఓజీ’ (OG) విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు సుజీత్ (Director Sujith) ఏం మేజిక్ చేశారో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓజాస్ గంభీరగా కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటించనుంది. ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi), ప్రకాష్ రాజ్ (, Prakash Raj), శ్రియా రెడ్డి (Shriya Reddy), అర్జున్ దాస్ (Arjun Das) ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుక ఎల్‌బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ కాస్ట్యూమ్స్ (Pawan Costumes) ప్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ విషయమై పవన్ మాట్లాడుతూ.. సినిమాల్లో వేసుకునే కాస్ట్యూమ్స్‌తో తానెప్పుడూ ఎలాంటి వేడుకకూ హాజరు కాలేదని.. డైరెక్టర్ సుజీత్ కారణంగా తానిలా రావాల్సి వచ్చిందన్నారు. ఇక ఇటీవల రిలీజైన'వాషి యో వాషి' పాట గురించి కూడా ఆయన స్పందించారు. ఇదొక జపనీస్ హైకూ అంటే పద్యమని పవన్ వెల్లడించారు. దాని అర్థం.. "నువ్వు అందనంత ఎత్తులో ఉన్నావు. నిన్ను నేలకు దించుతాను" అని విలన్‌కి వార్నింగ్ ఇచ్చే సందర్భంలో ఇది వస్తుందన్నారు. ముఖ్యంగా ఓజీతో పెట్టుకుంటే మరణం ఎంత భయంకరంగా ఉంటుందోనని ఈ పాట ద్వారా చెప్పడం జరిగిందన్నారు. సుజీత్ తనకు వీరాభిమాని అని.. ‘జానీ’ మూవీ సమయంలో చాలా రోజుల పాటు తలకు బ్యాండ్ కట్టుకుని తనతో తిరిగినట్టు చెప్పాడట.
సుజీత్ కథ సింపుల్‌గా తీస్తాడు కానీ తీసేటప్పుడు అతని సత్తా ఏంటో మనకు తెలుస్తుందన్నారు. సినిమాకు తాను కాకుండా ఇద్దరు స్టార్స్ ఉన్నారని.. వారే సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు సుజీత్ అని అన్నారు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో 80ల నాటి హీరోయిన్‌గా కనిపిస్తుందని.. సినిమాలో తామిద్దరి మధ్య అనుబంధం తక్కువసేపే అయినా కూడా అద్భుతంగా ఉంటుందన్నారు. తక్కువ సమయంలోనే ఒక అద్భుతమైన ప్రేమకథను సుజీత్ చూపించారన్నారు. ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూడటం అనేది తాను ‘ఖుషి’ సమయంలోనే చూశానన్నారు. సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లినా కూడా అభిమానులు (Pawan Fans) తనను దలడం లేదని ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుందన్నారు. తాను డైరెక్షన్ చేసే సమయంలో ఇలాంటి టీం ఉండి ఉంటే తాను పాలిటిక్స్‌లోకి వచ్చి ఉండేవాడని కాదన్నారు.
ప్రజావాణి చీదిరాల