Entertainment

Varalakshmi Sarathkumar: ఇంతకు మించి దిగజారదలుచుకోలే..

హీరోయిన్‌గానూ.. నటిగానూ తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. ప్రస్తుతం ‘సరస్వతి’ చిత్రంతో దర్శకురాలిగా కూడా మారింది. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Varalakshmi Sarathkumar: ఇంతకు మించి దిగజారదలుచుకోలే..

హీరోయిన్‌గానూ.. నటిగానూ తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. ప్రస్తుతం ‘సరస్వతి’ చిత్రంతో దర్శకురాలిగా కూడా మారింది. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. యావరేజ్ టాక్‌తో నడుస్తోంది. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా కథను అందించారు. కానీ తన పేరును ప్రమోషన్స్‌లో ఎక్కడ వాడకపోగా.. తన కథను రేప్ చేశారని.. చిరల్లో కొత్త కథను యాడ్ చేసి మొత్తానికి ఖూనీ చేశారంటూ సాయి మాధవ్ బుర్రా సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. దీనిపై తాజాగా నిర్వహించిన ‘సరస్వతి’ థ్యాంక్స్ మీట్‌లో వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించారు.

సాయి మాధవ్ పట్ల తనకు చాలా మర్యాద‌, గౌర‌వం ఉన్నాయని వరలక్ష్మి పేర్కొన్నారు.అయితే ఒక కథని ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా అలాగే చెబితే ఎవరూ యాక్సెప్ట్ చేయరని.. వాళ్లకు నచ్చదని అన్నారు తను ఎవరి కథనూ దొంగిలించలేదని.. కాంట్రాక్ట్ చేసుకుని డబ్బులిచ్చిన మీదటే కథ తనదైందన్నారు. ఆరేళ్లుగా ఈ చిత్ర కథ ఆయన వద్ద ఉందని.. అంత బాగుంటే ఆయనే ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సాధారణంగా రైటర్స్ మీతో పాటు కూర్చొని వర్క్ చేయాలని ఉందని చెబుతారని.. కానీ ఆయన చాలా బిజీ అని.. రెండు పెద్ద సినిమాలకు వెళ్లిపోవడంతో తననసలు కవలేదన్నారు. కథను కూడా ఓ ఆడియో నోట్‌లో తనకు పంపించారని వరలక్ష్మి పేర్కొన్నారు. తాను ఆ కథపై వర్క్ చేసి స్క్రీన్‌ప్లే మార్చుకున్నానని వెల్లడించారు. కానీ తన పేరు వేసుకోకుండా సాయి మాధవ్ బుర్రాపై ఉన్న మర్యాద కారణంగా తాను స్టోరీ అని ఆయన పేరు వేశానని వరలక్ష్మి చెప్పుకొచ్చారు.

అంతా కథ చాలా బాగుందని సాయి మాధవ్‌ బుర్రాను ట్యాగ్ చేస్తున్నారని అది ఎవరికి దక్కిన గౌరవమని వరలక్ష్మి ప్రశ్నించారు. తానొక సెన్సిటివ్ ఇష్యూపై సినిమా తీస్తే కథని రేప్ చేశారంటూ మాట్లాడటం ఏం బాగోలేదన్నారు. సాయి మాధవ్ బుర్రా ప్రవర్తన ఎక్స్‌ట్రీమ్‌లీ రూడ్ అని.. అసలు అలాంటి పదాన్ని ఆయనెలా వాడారో తెలియలేదన్నారు. తాము ఎంచుకున్న టాపిక్ గురించి అలాంటి వర్డ్ ఏమాత్రం సమంజసం కాదన్నారు. తాను ఇంతకు మించి దిగజారదలుచుకోలేదని.. ఇంత పెద్ద నిర్ణయం వెనుక ఎంత పెద్ద కథ నడిచి ఉంటుందని ప్రశ్నించారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 7, 2026 1:25 PM