Samantha-Raj: సమంత, రాజ్‌లు ఎప్పటి నుంచి డేటింగ్‌లో ఉన్నారు?
దగ్గరి బంధువులు, అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య సమంత మెడలో రాజ్ మూడు ముళ్లు వేశారు. అసలు వీరిద్దరి పరిచయం ఎప్పుడు జరిగింది? డేటింగ్ ఎప్పుడు ప్రారంభించారు? వంటి విషయాల గురించి తెలుసుకుందాం
ఇవాళ స్టార్ హీరోయిన్ సమంత, రాజ్ నిడిమోరుల వివాహం కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో జరిగింది. ‘భూత శుద్ధి వివాహం’ పేరిట వీరి వివాహం జరిగింది. దగ్గరి బంధువులు, అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య సమంత మెడలో రాజ్ మూడు ముళ్లు వేశారు. అసలు వీరిద్దరి పరిచయం ఎప్పుడు జరిగింది? డేటింగ్ ఎప్పుడు ప్రారంభించారు? వంటి విషయాల గురించి తెలుసుకుందాం. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 సెట్స్‌లో సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరుల పరిచయం జరిగింది. జూన్ 2021లో అమెజాన్ ప్రైమ్ వేదికగా రాజ్ అండ్ డీకే రూపొందించిన ‘ఫ్యామిల మ్యాన్ 2’ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యింది.
‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 సెట్స్‌లోనే సమంత మొదటిసారి రాజ్ నిడిమోరును కలిసింది. ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్ర పోషించి స్పై థ్రిల్లర్ సిరీస్‌లో.. సమంత రాజలక్ష్మి శేఖరన్ అకా రాజి పాత్రను పోషించింది. ఆ తరువాత రాజ్‌అండ్ డీకే రూపొందించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’లో సైతం సమంత నటించింది. మరోసారి ఈ సిరీస్‌లోనే సమంత, రాజ్ కలిశారు. ఈ వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోస్‌లో 2024లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ రెండు సిరీస్‌లకు మధ్యలో వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించారు.
సమంత, రాజ్ 2023లో డేటింగ్ ప్రారంభించారు. దాదాపు ఒక సంవత్సరం పాటు రహస్యంగా డేటింగ్ చేసిన తర్వాత, గత ఏడాది కాలంలో ఈ జంట బాగా వార్తల్లో నిలిచారు. 2025లో సమంత పికిల్ బాల్ టీం, పెర్ఫ్యూమ్ బ్రాండ్ ప్రారంభోత్సవంలో రాజ్ కనిపించారు. ఇక నేడు (డిసెంబర్ 1) వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గతంలో అంటే 2017లో సమంతకు నాగచైతన్యతో వివాహం కాగా.. వీరిద్దరూ 2021లో విడాకులు తీసుకున్నారు. ఇక రాజ్ కూడా గతంలో హిందీ చిత్రాలకు అసెస్టింగ్ డైరెక్టర్‌గా పని చేసిన శ్యామలి డేను వివాహం చేసుకున్నారు.
ప్రజావాణి చీదిరాల