Biggboss 9: ఊరించి ఉసూరుమనిపించరు కదా..
బిగ్‌బాస్ సీజన్ 9 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన ప్రోమో కూడా బయటకు వచ్చేసింది. ఈ వీడియోలో కామన్ మ్యాన్ కేటగిరీలోని కంటెస్టెంట్స్‌ను తప్ప..

బిగ్‌బాస్ సీజన్ 9 (Biggboss Season 9) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన ప్రోమో (Biggboss Promo) కూడా బయటకు వచ్చేసింది. ఈ వీడియోలో కామన్ మ్యాన్ (Common Man) కేటగిరీలోని కంటెస్టెంట్స్‌ను తప్ప సెలబ్రిటీల ముఖాలు అయితే రివీల్ చేయలేదు. సెలబ్రిటీల వాయిస్ అయితే వినిపించింది. ఒక కంటెస్టెంట్ హౌస్‌లోకి గిఫ్ట్ తీసుకెళ్లేందుకు యత్నించాడు. అదేంటని చూపించేందుకు మాత్రం నిరాకరించాడు. అది తనతో ఉంటేనే తాను బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటానని తెగేసి చెప్పాడు. కానీ బిగ్‌బాస్ ఒప్పుకోలేదు. దీంతో తాను బయటకు వెళ్లిపోతానని చెప్పగా.. బిగ్‌బాస్ (Biggboss) కూడా ‘నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు’ అని చెప్పాడు. మొత్తానికి ఏదో వైవిద్యంగా ప్లాన్ చేశామని మునుపటిలా ఉండదని నాగార్జున అయితే ఊదరగొట్టేస్తున్నారు.
ఈసారి సెలబ్రిటీల (Celebrities)తో పాటు కామన్ మ్యాన్ కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకునే బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)లోకి అడుగు పెడుతున్నారు. కాబట్టి ఈసారి కామన్ మ్యాన్ కేటగిరిలో వచ్చిన వారితో సెలబ్రిటీలకు పెద్ద దెబ్బేనని చెప్పాలి. ఒకవేళ కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి వచ్చినవారు తామేదో తోపు, తురుముఖాన్‌ల మాదిరిగా ఫీల్ అయితే మాత్రం వారికే దెబ్బ. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వారికే మంచి జరుగుతుంది. ఇక ఇవాళ్టి బిగ్‌బాస్ ప్రారంభ షోకి సంబంధించి ఇప్పటికే రెండు ప్రోమోలు అయితే వచ్చాయి. తొలి ప్రోమోలో ‘ఊహకందని మార్పులు.. ఊహించని మలుపులు.. డబుల్ హౌస్.. డబుల్ జోష్’ వంటి మాటలతో నాగార్జున షోకి హైప్ ఇవ్వడానికి అయితే గట్టిగానే ప్రయత్నించారు. సెలబ్రిటీస్ ఎంట్రీని సైతం చూపించారు కానీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.
కామన్ మ్యాన్ కేటగిరి నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ (Biggboss Contestants)తో నాగ్ స్పాంటినియస్ జోకులు.. బ్లైండ్ ఫోల్డ్‌తో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టడం వంటి దృశ్యాలను ప్రోమోలో చూపించారు. ‘ఇప్పటి వరకూ నాలో యుద్ధభూమిలో శంఖం పూరించే కృష్ణుడిని చూశారు. ఈ సీజన్‌లో రంగంలోకి దిగే అర్జనుడిని చూస్తారు’ అంటూ బిగ్‌బాస్ డైలాగులు అయితే ఆకట్టుకునేలాగే ఉన్నాయి. రెండు హౌస్‌లను నాగ్ చూపించారు. ఆ తరువాత సెలబ్రిటీల ఇంట్రడక్షన్. అయితే తన బాడీలో ఒక పార్ట్ అని దానిని హౌస్‌లోకి తీసుకెళతాననగా బిగ్‌బాస్ అంగీకరించలేదు. ఇక రెండో ప్రోమోలో బిగ్‌బాస్ అగ్నిపరీక్ష (Biggboss Agnipariksha) జ్యూరీ అయిన అభిజిత్ (Abhijith), బిందు మాధవి (Bindu Madhavi), నవదీప్ (Navadeep), యాంకర్ శ్రీముఖి (Anchor Srimukhi) ఎంట్రీ ఇచ్చారు. మొత్తానికి బిగ్‌బాస్ సీజన్ 9కు నాగ్, బిగ్‌బాస్ కలిసి గట్టి హైపే ఇచ్చారు కానీ ఊరించి ఉసూరు మనిపించరు కదా.. ఏమో చూడాలి.
ప్రజావాణి చీదిరాల