Entertainment

Hey Balwanth Review: సినిమా ఎలా ఉందంటే..

సుహాస్ తన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పాత్రకు ప్రాధాన్యం, కథలో బలం ఉంటే విలన్ పాత్రకైనా వెనుకాడడు. అలాంటి సుహాస్‌కు ఇటీవలి కాలంలో మంచి హిట్స్ పడిందే లేదు. ఈ నేపథ్యంలోనే ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘హే బల్‌వంత్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Hey Balwanth Review: సినిమా ఎలా ఉందంటే..

చిత్రం: హే బల్‌వంత్‌

విడుదల తేదీ: 20-02-2026

నటీనటులు: సుహాస్, శివానీ నాగారం, నరేశ్, స్రవంతి, సుదర్శన్, హర్షవర్ధన్, వెన్నెల కిశోర్, అజయ్‌ ఘోష్, అన్నపూర్ణమ్మ తదితరులు

సంగీతం: వివేక్‌ సాగర్‌

రచన, దర్శకత్వం: గోపీ అచ్చర

నిర్మాత: బి.నరేంద్ర రెడ్డి

సుహాస్ తన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పాత్రకు ప్రాధాన్యం, కథలో బలం ఉంటే విలన్ పాత్రకైనా వెనుకాడడు. అలాంటి సుహాస్‌కు ఇటీవలి కాలంలో మంచి హిట్స్ పడిందే లేదు. ఈ నేపథ్యంలోనే ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘హే బల్‌వంత్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది. సుహాస్‌కు తిరిగి సక్సెస్ అందిస్తుందా? తెలుసుకుందాం.

కథేంటంటే..

చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన కుర్రాడు కృష్ణ (సుహాస్‌)ను నాన్న రావు బల్‌వంత్‌ (నరేశ్‌).. నాన్నమ్మ (అన్నపూర్ణమ్మ) అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అతనికి చిన్నప్పటి నుంచి తన తండ్రే హీరో, రోల్ మోడల్. తండ్రి వ్యాపారాన్ని స్వీకరించి మంచి పేరు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఉంటాడు. ఈ క్రమంలోనే తన చదువు పూర్తవగానే తండ్రికి ఆయన బిజినెస్ టేకోవర్ చేస్తానని చెబుతాడు. దీనికి బల్‌వంత్ ఏమాత్రం అంగీకరించాడు. బల్‌వంత్ అనారోగ్యంతో హాస్పిటల్ పాలవడంతో డాక్టర్లు ఆయన బిజినెస్‌తో పాటు అన్ని వ్యవహారాల నుంచి రెస్ట్ తీసుకోవాలని సూచిస్తారు. దీంతో ఇక తండ్రి బిజినెస్ టేకోవర్ చేసే తరుణం వచ్చిందని తెలుసుకున్న కృష్ణ సూటు, బూటు వేసుకుని తండ్రి బిజినెస్ గురించి కలలు కంటూ తండ్రి వ్యాపార స్థలానికి వెళతాడు. కానీ తండ్రి బిజినెస్ ఏంటో తెలుసుకున్నాక అతనికి బుర్ర గిర్రున తిరుగుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. ఆ వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తే ప్రేమించిన అమ్మాయి మిత్ర (శివానీ నాగారం)కు కూడా దూరమవ్వాల్సి వస్తుంది. అలాంటి సమయంలో కృష్ణ ఏం చేశాడు? ఇంతకీ తండ్రి చేసే బిజినెస్ ఏంటి? ఆ బిజినెస్‌లోకి హీరోయిన్ కుటుంబం ఎలా వచ్చి ఇరుక్కుంది? వంటి అంశాలను వెండితెరపై చూడాల్సిందే.

ఎలా సాగిందంటే..

సినిమా మొత్తం రావు బల్‌వంత్ చేసే వ్యాపారం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దానిలోకే వివిధ పాత్రలు రావడం వంటివి జరుగుతుంది. తండ్రిలాగే హీరోలా బతకాలని కృష్ణ అనుకోవడం.. తన కొడుకుని తన బిజినెస్ పరిసరాల్లోకి కూడా రావు బల్‌వంత్ రానివ్వకపోవడం.. తీరా వచ్చాక కథంతా హిలేరియస్‌గా సాగుతుంది. మంచి జీవితానికి చదువే షార్ట్‌కట్ అనే సందేశం ఈ చిత్రంలో అంతర్లీనంగా ఉంటుంది. వాస్తవానికి గతంలో ఇచ్చిన ఏ అప్‌డేట్స్‌లోనూ తండ్రి బిజినెస్ ఏమిటన్నది రివీల్ చేయకుండా ఆసక్తిని పెంచేసిన దర్శకుడు.. సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే రివీల్ చేసి దాన్ని చూశాక హీరో రియాక్షన్ ఎలా ఉంటుందన్న ఆసక్తితో కథను నడిపించారు. కృష్ణ తండ్రి వ్యాపారాన్ని టేకోవర్ చేయాలనుకున్నప్పటి నుంచి కథలో కామెడీ యాంగిల్ ప్రారంభమవుతుంది. సుహాస్‌కు సుదర్శన్ తోడవంతో కథ మరింత హిలేరియస్‌గా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే వెన్నెల కిషోర్ ఎంట్రీతో కామెడీని పీక్స్‌కు తీసుకెళ్లారు. కృష్ణ వ్యాపారంలోకి కథానాయిక కుటుంబం వచ్చి ఇరుక్కోవడంతో కామెడీ డబుల్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయంతో పాటు హీరోయిన్ తాత (బాబు మోహన్) చావుతో తీర్చిదిద్దిన దర్శకుడు.. సెకండాఫ్‌ను మరింత హిలేరియస్‌గా మార్చేశారు. సెకండాఫ

ఎవరెలా చేశారంటే..

కృష్ణ పాత్రలో సుహాస్‌ అద్భుతంగా నటించాడు. సినిమాకు హీరో అయితే నరేశ్ అనే చెప్పాలి. బాలయ్యను ఇమిటేట్ చేయడం నుంచి అన్ని రకాలుగా తన పాత్రలో నరేశ్ ఒదిగిపోయారు. నరేశ్ పాత్రకు బీభత్సమైన ఎలివేషన్స్ ఇచ్చి ఆయనలోని నవరసాలను దర్శకుడు గోపి బయటకు తీశారు. మిత్రగా శివానీ బాగానే నటించింది. సుదర్శన్, వెన్నెల కిశోర్, అజయ్‌ ఘోష్‌ పాత్రలు కూడా సినిమాకు కీలకమైనవే కావడంతో పాటు బాగా నవ్వించారు. ముఖ్యంగా సుదర్శన్ పాత్ర సినిమాకు మంచి జోష్ ఇచ్చింది. ఇక స్రవంతి కూడా తన నటనతో చక్కగా ఆకట్టుకుంది. హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. వివేక్‌ సాగర్ పాటలైతే ఆకట్టుకోలేదు కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్వాలేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా బాగానే ఉన్నాయి.

చివరిగా: ‘హే బల్‌వంత్‌’.. కడుపుబ్బ నవ్విస్తాడు.

రేటింగ్: 3/5

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 20, 2026 3:45 AM