బార్ వద్ద ఐటీ ఉద్యోగితో గొడవ.. కిడ్నాప్ చేసి చితకబాదిన హీరోయిన్
మలయాళ నటి లక్ష్మీ మేనన్ దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కిడ్నాప్ కేసులో లక్ష్మీ మేనన్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. అసలేం జరిగింది? లక్ష్మీ మేనన్ ఏం చేసింది అంటారా?

మలయాళ నటి లక్ష్మీ మేనన్ (Lakshmi Menon) దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కిడ్నాప్ (Kidnap) కేసులో లక్ష్మీ మేనన్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. అసలేం జరిగింది? లక్ష్మీ మేనన్ ఏం చేసింది అంటారా? కొచ్చిలో ఓ ఐటీ ఉద్యోగి (IT Employee)ని కిడ్నాప్ చేసి చితకబాదిందని ఆమెపై ఫిర్యాదు నమోదైంది. తన స్నేహితులతో కలిసి లక్ష్మీ మేనన్ ఐటీ ఉద్యాగిని కిడ్నాప్ చేసి, అతడిపై దాడి చేసిందని తెలుస్తోంది. ఈ కేసులో లక్ష్మీమేనన్ స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆమె మాత్రం పరారీలో ఉంది. ప్రస్తుతం లక్ష్మీ మేనన్ కోసం పోలీసులు గాలింపులు నిర్వహిస్తున్నారు. అయితే ఎఫ్‌ఐఆర్ (FIR)లో మాత్రం ఆమె పేరును ఇంకా చేర్చకపోవడం గమనార్హం.
అసలేం జరిగిందంటే..
లక్ష్మీ మేనన్ తన స్నేహితులతో కలిసి కొచ్చిలోని ఓ బార్ వద్ద ఐటీ ఉద్యోగి బృందాలతో గొడవకు దిగింది. తొలుత వాగ్వాదంగానే ప్రారంభమైనా కూడా చివరకు అది గొడవగా మారింది. ఆ తరువాత సదరు ఐటీ ఉద్యోగిని లక్ష్మీ మేనన్‌తో పాటు ఆమె స్నేహితులు వెంబడించి మరీ అతని కారును అడ్డుకుని బలవంతంగా అతడిని కారులో ఎక్కించుకుని దాడికి పాల్పడ్డారు. అతడిని దూషిస్తూ చితకబాదినట్టుగా తెలుస్తోంది. ఆ తరువాత అతడిని మరో ప్రదేశంలో వదిలేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు లక్ష్మీ మేనన్ సహా ఆమె ముగ్గురు స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే లక్ష్మీమేనన్ పరారీలో ఉంది. ఆమె ఫోన్ సైతం స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఆమె కోసం గాలింపులు నిర్వహిస్తున్నారు.
హీరోయిన్స్ ఎవరైనా వివాదాలకు చాలా దూరంగా ఉన్నారు. కానీ లక్ష్మీ మేనన్ మాత్రం వివాదాన్ని వెదుక్కుంటూ వెళ్లిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. కొచ్చికి చెందిన లక్ష్మీ మేనన్.. తమిళ, మలయాళంలో హీరోయిన్‌గా నటింది. తెలుగు ప్రేక్షకులకు సైతం ఈమె సుపరిచితమే. ‘గజరాజు (Gajaraju)’, ‘ఇంద్రుడు (Indrudu)’, ‘చంద్రముఖి 2 (Chandramukhi 2)’, ‘శబ్దం (Shabdam)’ తదితర డబ్బింగ్ సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్‌ను లక్ష్మీ మేనన్ మెప్పించింది.