Hero Nikhil: ట్వీట్ చేసి అడ్డంగా బుక్కైన నిఖిల్.. సినిమా అటు ఇటు అయ్యిందో..
నిఖిల్ ది అత్యుత్సహమో.. అహంకారమో కానీ మొత్తానికి పక్క సినిమాలపై సెటైర్ వేసే స్థాయికి దిగజారాడు. వాస్తవానికి ఆయన నటిస్తున్న ‘స్వయంభు’ ఇంకా రిలీజ్ కూడా కాలేదు. అప్పుడే సెటైర్లు వేస్తున్నాడు. ఒక సినిమాను హీరో అయ్యుండి తక్కువ చేసి మాట్లాడటం ఎంతవరకు సమంజసం?
హీరో నిఖిల్‌ది అత్యుత్సహమో.. అహంకారమో కానీ మొత్తానికి పక్క సినిమాలపై సెటైర్ వేసే స్థాయికి దిగజారాడు. వాస్తవానికి ఆయన నటిస్తున్న ‘స్వయంభు’ ఇంకా రిలీజ్ కూడా కాలేదు. అప్పుడే సెటైర్లు వేస్తున్నాడు. ఒక సినిమాను హీరో అయ్యుండి తక్కువ చేసి మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. రేపు ‘స్వయంభు’ హిట్ అయితే ఓకే.. ఒకవేళ కాకుంటే ఏంటి పరిస్థితి? నిఖిల్ స్టేట్‌మెంట్స్ ట్రోల్ మీమ్స్‌గా తిరిగి రావడం పక్కా అని అంటున్నారు.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో 'ఏఐ' అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి తిలోదకాలు వదిలి ఏఐని ఎక్కువగా నమ్ముకుంటున్నారు. ఈ క్రమంలోనే తాము ఏఐని మా సినిమాలో వాడలేదు బాబోయ్ అని కొందరు హీరోలతో పాటు దర్శక నిర్మాతలు సైతం చెప్పుకోవాల్సి వస్తోంది. ఇలా చెప్పుకుంటే ఇబ్బందేం లేదు కానీ యంగ్ హీరో నిఖిల్‌లా చెబితేనే కష్టం. తన సినిమా గురించి మాట్లాడుతూనే.. మరో సినిమా గురించి కామెంట్ చేసి చిక్కుల్లో పడిపోయాడు. నాలుగు రోజుల క్రితం నిఖిల్ హీరోగా నటించిన ‘స్వయంభు’ చిత్రం టీజర్ వచ్చింది. దానిని చూసిన వారంతా పెదవి విరిచారు.
కంటెంట్ అయితే పర్వాలేదు అనిపించినా కూడా టీజర్ క్వాలిటీపై మాత్రం విమర్శలు గుప్పించారు. దీంతో ‘స్వయంభు’ మేకర్స్ తాజాగా మరోసారి హెచ్‌డీఆర్ క్వాలిటీతో టీజర్ అప్‌లోడ్ చేశారు. ఇదే విషయాన్ని ట్విటర్‌లో నిఖిల్ చెప్పాడు. అంతటితో ఆగి ఉంటే బాగుడేంది కానీ రీసెంట్‌గా వచ్చిన ఓ సినిమాలా మా దానిలో ఎలాంటి ఏఐ ఉపయోగించలేదు అని అన్నాడు. దీంతో విమర్శలు ప్రారంభమయ్యాయి. నిఖిల్ ట్వీట్ చేసే సమయానికి ‘నాగబంధనం’ మూవీ టీజర్ విడుదలైంది. నిఖిల్ ఈ చిత్రంపైనే కౌంటర్ వేశాడని అంతా భావిస్తున్నారు. రెండూ కూడా విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యమున్న చిత్రాలే కావడం విశేషం. దీంతో ‘నాగబంధనం’పై నిఖిల్ కౌంటర్ వేశాడని అంతా అనుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయి హిట్ అయితే ఓకే కానీ ఒకవేళ దెబ్బకొట్టిందో.. నిఖిల్‌కి మీమర్స్ చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.