Entertainment Breaking News

5న ప్రేక్షకుల ముందుకు ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’

ప్రపంచ పాప్ కల్చర్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫాంటసీ ప్రపంచాల్లో ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ ఒకటి. ఇది ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

5న ప్రేక్షకుల ముందుకు ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్” జూన్ 5న భారతదేశంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో ప్రముఖ విలన్ పాత్ర స్కెలెటర్‌కు హిందీ వెర్షన్‌లో ప్రముఖ నటుడు జావేద్ జాఫ్రీ వాయిస్ అందిస్తున్నారు. మిగిలిన భాషల్లో ఆదిత్య మీనన్ తన గాత్రాన్ని అందించనున్నారు. ప్రపంచ పాప్ కల్చర్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫాంటసీ ప్రపంచాల్లో ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ ఒకటి. ఇది ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెజాన్ MGM స్టూడియోస్ నిర్మించిన ఈ భారీ చిత్రం జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఆదిత్య మీనన్ మాట్లాడుతూ.. హీ-మ్యాన్ ఫ్రాంచైజీతో తనకు చిన్ననాటి నుంచి ఎంతో అనుబంధం ఉందని... స్కెలెటర్ వంటి ఐకానిక్ విలన్‌కు మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పడంఒక అద్భుతమైన అనుభవమన్నారు. మా తరం ప్రేక్షకులకు స్కెలెటర్ అత్యంత గుర్తుండిపోయే ప్రతినాయకుల్లో ఒకరని పేర్కొన్నారు. అలాంటి పాత్రకు గాత్రం అందించడం గౌరవంగా భావిస్తున్నానని ఆదిత్య మీనన్ తెలిపారు. స్కెలెటర్ పాత్రలో ఒక ప్రత్యేకత ఉంటుందని.. అతను ఒకవైపు భయంకరంగా కనిపిస్తూనే మరోవైపు చాలా నాటకీయమైన శైలిని కలిగి ఉంటాడని పేర్కొన్నారు. ఆ లక్షణాలు నటుడిగా తనకు ఎన్నో కొత్త ప్రయోగాలు చేసే అవకాశాన్ని ఇచ్చాయన్నారు. ప్రతి భాషకు ఒక ప్రత్యేకమైన శైలి, రిథమ్ ఉండటంతో ప్రతి వెర్షన్‌ను భిన్నంగా మలచడానికి ప్రయత్నించినట్టు ఆదిత్య మీనన్ తెలిపారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 1, 2026 12:55 PM