Mahesh Babu: మహేష్ ఫ్యామిలీ నుంచి బరిలోకి అరడజను మంది.. ఫ్యాన్ వార్ స్టార్ట్..
మహేష్ (Mahesh Babu) ఫ్యామిలీ నుంచి ఆరుగురు రంగంలోకి దిగనున్నారంటూ న్యూస్. ఇంతకీ ఆ ఆరుగురు ఎవరు? ఈ ఆరుగురి న్యూస్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చేంటి?
నిప్పు లేనిదే పొగ రాదు అంటారు పెద్దలు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) గురించి ఓ న్యూస్ సోషల్ మీడియా (Social Media)ను షేక్ చేస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలోకి మహేశ్ బాబు మేనకోడలు.. సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మంజుల కూతురు జాన్వీస్వరూప్ త్వరలోనే తెరంగేట్రం చేయనున్నట్టు సమాచారం ఇలా వచ్చిందో లేదో.. అలా ఒకరు కాదండి బాబు.. మహేష్ ఫ్యామిలీ నుంచి ఆరుగురు రంగంలోకి దిగనున్నారంటూ న్యూస్. ఇంతకీ ఆ ఆరుగురు ఎవరు? ఈ ఆరుగురి న్యూస్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చేంటి? తెలుసుకుందాం.
ఆ ఆరుగురు ఎవరంటే..
మహేష్ బాబు ఫ్యామిలీ (Mahesh Babu Family) నుంచి ఆరుగురు సినీరంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నారట. వారిలో జాన్వీ స్వరూప్ గురించి ఇప్పటికే చెప్పుకున్నాం కదా.. రెండవ వ్యక్తి జయ కృష్ణ.. ఈయన ఎవరో కాదులెండి.. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు (Mahesh Brother Ramesh Babu) కుమారుడు. మరో ఇద్దరు వ్యక్తులు చరిత్, దర్శన్. వీళ్లిద్దరు ఎవరంటారా? సుధీర్ బాబు (Sudheer Babu) కుమారులు. ఇక ఐదవ వ్యక్తి భారతి ఘట్టమనేని. ఈమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈమె ఎవరో కాదు.. రమేష్ బాబు కూతురు. ఇక ఆరవ వ్యక్తి ఎవరో తెలుసా? మహేష్ బాబు గారాల కుమారుడు గౌతమ్ ఘట్టమనేని (Gowtham Ghattamaneni). ప్రస్తుతం గౌతమ్ ఫిలిమ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని సమాచారం.
మెగా వర్సెస్ మహేష్ ఫ్యాన్స్..
మొత్తానికి అరడజను మంది అయితే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. మరి సోషల్ మీడియాలో రచ్చేంటి అంటారా? ఇప్పటి వరకూ మెగా ఫ్యామిలీ (Mega Family)ని క్రికెట్ టీం (Cricket Team) అంటూ ఎద్దేవా చేసేవారు.. ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ ఏంటి కబడ్డీ టీమా? లేదంటే కోకో టీమా? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో మెగా వర్సెస్ మహేష్ ఫ్యాన్స్ (Mega Vs Mahesh Fans) దీనిపై సోషల్ మీడియా వేదికగా గొడవకు దిగుతున్నారు. ప్రస్తుతం ఘట్టమనేని ఫ్యామిలీ (Ghattamaneni Family) నుంచి రానున్న వారిలో గౌతమ్ మినహా ఎవరూ సక్సెస్ కారని ఒకరు.. చరిత్ మరో అల్లు అర్జున్ (Allu Arjun) అవుతాడని మరొకరు.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
మహేష్‌కే ఇక్కడ మార్కెట్ లేదు..
ఎవరు వచ్చినా ఫేస్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ ఉండదు.. రోబోల మాదిరిగానే అంటూ మెగా ఫ్యాన్స్ (Mega Fans) సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. మరోవైపు.. మహేష్ ఫ్యామిలీ నుంచి ఎవరొచ్చినా మేము మెగా ఫ్యాన్స్ మాదిరిగా బానిసత్వం చేయమని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. దీనికి కౌంటర్‌గా మెగా ఫ్యాన్స్.. ‘మహేష్ బాబుకే ఇక్కడ మార్కెట్ లేక టైర్ 2 హీరోలతో చేస్తున్నాడు. రాజమౌళి (SS Rajamouli)ని పదేళ్లనుంచి ట్వీట్స్ వేసి బతిమలాడితే ఇప్పుడు ఓకే అని మూవీ తీస్తున్నాడు. వీళ్లు వచ్చి ఏం చేస్తారు?’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలా వార్ అయితే కొనసాగుతూనే ఉంది. మొత్తానికి మహేష్ ఫ్యామిలీ నుంచి కొందరు ఎంట్రీ ఇవ్వాలనుకోవడం ఏమో కానీ ఇది కాస్తా ఫ్యాన్ వార్ (Mega Vs Mahesh Fan war)కి దారి తీసింది.
ప్రజావాణి చీదిరాల