Euphoria: గుణశేఖర్ ‘యుఫోరియా’ రిలీజ్ డేట్ ఫిక్స్..
20 ఏళ్ల క్రితం గుణ శేఖర్, భూమిక కాంబోలో వచ్చిన ‘ఒక్కడు’ (Okkadu Movie) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇన్నాళ్లకు తిరిగి వీరిద్దరి కాంబో రిపీట్ అవడంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

గుణశేఖర్ (Director Gunasekhar) దర్శకత్వంలో ఒక క్రేజీ టైటిల్‌తో రూపొందిన చిత్రం ‘యుఫోరియా (Euphoria)’. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఒక డిఫరెంట్ కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో భూమిక (Bhumika) ప్రధాన పాత్రలో నటించగా.. సారా అర్జున్ (Sara Arjun), నాజర్ (Nazar), రోహిత్ (Rohit), విఘ్నేష్ గవిరెడ్డి (Vignesh Gavireddy), లిఖిత యలమంచలి (Likhita Yalamanchali), అడ్డాల పృధ్వీరాజ్ (Addala Prudhviraj), కల్ప లత తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే సినిమా విడుదల తేదీని మేకర్స్ ఒక పోస్టర్‌తో ప్రకటించారు.
దీపావళి (Diwali) పండుగ సందర్భంగా ‘యుఫోరియా’ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా విడుదల చేశారు. పోస్టర్‌లో భూమిక స్మైలీ లుక్‌తో ప్లేటులో పువ్వులతో ఒక చోట.. మరోచోట ఓ పిల్లాడితో ఆడుతూ కనిపించింది. 20 ఏళ్ల క్రితం గుణ శేఖర్, భూమిక కాంబోలో వచ్చిన ‘ఒక్కడు’ (Okkadu Movie) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇన్నాళ్లకు తిరిగి వీరిద్దరి కాంబో రిపీట్ అవడంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రంలో భూమిక రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుందని టాక్. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా అద్భుతమైన మెసేజ్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్టుగా సమాచారం.
ప్రజావాణి చీదిరాల