Ustaad Bhagat Singh: ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్‌గీత
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుంచి మరో ఖుషీ ఖబర్ వచ్చేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ గ్లింప్స్ విడుదల చేశారు. గ్లింప్స్ చూస్తుంటే పవన్ మరో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుంచి మరో ఖుషీ ఖబర్ వచ్చేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ గ్లింప్స్ విడుదల చేశారు. గ్లింప్స్ చూస్తుంటే పవన్ మరో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. గ్లింప్స్ విడుదలయ్యీ అవగానే నెట్టింట దూసుకెళుతోంది. పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ వేరే లెవల్ అని చెప్పాలి. హరీష్ శంకర్.. పవన్ పాత్రను చాలా స్ట్రాంగ్‌గా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది. ‘ధర్మ సంరక్షణము కొరకు ప్రతి యుగమున అవతారం దాల్చుచున్నాడు’ అంటూ సాగే భగవద్గీత సారాంశముతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది.
‘ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్‌గీత‘ అంటూ పవన్ శత్రువులకు ఒక గీత గీయడం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. మొత్తానికి గ్లింప్స్‌తో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందన్నది చూపించేశారు. ఇక తరువాత అప్‌డేట్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి మరింత పెరిగింది. సినిమాపై అంచనాలైతే బీభత్సంగా ఉన్నాయి. పవన్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం మరో ‘గబ్బర్‌సింగ్’ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. శ్రీలీల, రాశి ఖన్నా ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించారు. ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.