Entertainment

Allu Arjun: అల్లు అర్జున్ కుటుంబానికి జీహెచ్ఎంసీ షాక్..

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ షాక్ ఇచ్చింది. తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే..

Allu Arjun: అల్లు అర్జున్ కుటుంబానికి జీహెచ్ఎంసీ షాక్..

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Arvind)కు జీహెచ్‌ఎంసీ (GHMC) షాక్ ఇచ్చింది. తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే.. జూబ్లీహిల్స్‌ (Jubleehills) రోడ్‌ నం. 45లోని అల్లు బిజినెస్‌ పార్క్‌ పేరుతో ఒక భవనం నిర్మించారు. ఈ బిల్డింగ్‌కు ముందుగానే పర్మిషన్ తీసుకున్నారు. అయితే ఆ పర్మిషన్ నాలుగు అంతస్థుల వరకూ మాత్రమే ఉంది. అయితే, కొద్దిరోజుల క్రితం అల్లు అరవింద్.. అదనంగా దానిపై ఓ పెంట్‌హౌస్‌‌ను సైతం నిర్మించారు. దీంతో అనుమతులు లేకుండా నోటీసులు జారీ చేసినందుకు జీహెచ్ఎంసీ అధికారులు.. అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేశారు.

అల్లు అరవింద్‌కు జీహెచ్ఎంసీ ఇచ్చిన షోకాజ్ నోటీసులో అక్రమంగా నిర్మించిన ఆ పెంట్‌హౌస్‌ను ఎందుకు కూల్చవద్దో తెలపాలంటూ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-18 అధికారులు పేర్కొన్నారు. అల్లు బిజినెస్‌ పార్క్‌ను 2023లో అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) 101వ జయంతి సందర్భంగా అల్లు అర్జున్ కుటుంబం ప్రారంభించింది. ఈ భవనంలో గీతా ఆర్ట్స్ (Geetha Arts), అల్లు ఆర్ట్స్ (Allu Arts) వంటి కుటుంబ వ్యాపారాలను ఈ భవనంలో అల్లు కుటుంబం నిర్వహిస్తోంది. అనుమతులు లేకుండా పెంట్‌హౌస్‌ నిర్మించారని పేర్కొంటూ.. దానిని కూల్చేస్తామంటూ జీహెచ్‌ఎంసీ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. దీనిపై అల్లు అర్జున్ కుటుంబం ఎాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 9, 2025 8:28 AM