Entertainment

GedelaRaju Trailer: నాకు కావల్సింది కోపం కాదురా.. భయం

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, నటుడు రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన ‘గేదెల రాజు’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో రఘు పాత్రను హైలైట్ చేస్తూ ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది.

GedelaRaju Trailer: నాకు కావల్సింది కోపం కాదురా.. భయం

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, నటుడు రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన ‘గేదెల రాజు’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో రఘు పాత్రను హైలైట్ చేస్తూ ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. కాకినాడ తాలుకా అనే ట్యాగ్‌టైన్‌తో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది. తాజాగా ట్రైలర్‌ను విడుద చేసింది. ‘మహాభారతంలో కనికుడు అనేవాడు ఒకడుండేవాడు.. వాడి నీతి చాలా దారుణంగా ఉండేది’ అంటూ రఘు పాత్రను ట్రైలర్‌లో పరిచయం చేశారు.

‘నిన్ను కొట్టాననుకో.. వీడికి కోపమొస్తుంది. అదే వీడినే కొట్టాననుకో.. నీకు, వీడికి భయం వేస్తది. నాకు కావల్సింది కోపం కాదురా.. భయం’ అంటూ రఘు కుంచె అదరగొట్టేశారు. ‘చూస్తే ఒకటే నిజం.. చూడకపోతే వంద అనుమానాలు’ అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉంది. డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. రఘు కుంచె సమర్పిస్తున్న ఈ సినిమాను వాణి రవికుమార్ నిర్మించారు. వికాస్ ముప్పాల, రామచంద్రం పుణ్యమంతుల, టీనా శ్రావ్య, మౌనిక కల్పాక తదితరులు కీలక పాత్రలు పోషించారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 5, 2026 9:24 AM