Raghu Kunche: ముహూర్తం ఫిక్స్ చేసుకున్న ‘గేదెల రాజు’
సమ్మర్‌లో సినిమాలే సినిమాలు.. మరీ ముఖ్యంగా ఏప్రిల్‌లో సినీ ప్రియులకు పండగే. ఏప్రిల్ 10న ‘డెకాయిట్’ రానుండగా.. అదే రోజున నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘స్వయంభు’ విడుదల కానుంది. ఆ తరువాత వారం అంటే మంచి టైమ్ చూసుకుని ‘గేదెల రాజు’ బరిలోకి దిగుతున్నాడు.
సమ్మర్‌లో సినిమాలే సినిమాలు.. మరీ ముఖ్యంగా ఏప్రిల్‌లో సినీ ప్రియులకు పండగే. ఏప్రిల్ 10న ‘డెకాయిట్’ రానుండగా.. అదే రోజున నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘స్వయంభు’ విడుదల కానుంది. ఆ తరువాత వారం అంటే మంచి టైమ్ చూసుకుని ‘గేదెల రాజు’ బరిలోకి దిగుతున్నాడు. ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సంగీత దర్శకుడు, సింగర్ రఘు కుంచే ‘గేదెల రాజు’ టైటిల్ రోల్ పోషించారు. ‘చూస్తే ఒకటే నిజం చూడకపోతే వంద అనుమానాలు’ అనే ఆసక్తికర పాయింట్‌తో దర్శకుడు చైతన్య మోటూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
మోటూరి టాకీస్ పతాకంపై రఘుకుంచె ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఆసక్తికర టైటిల్‌తో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. సంగీత దర్శకుడు, గాయకుడు అయిన రఘు కుంచె ఆ తరువాత నటుడిగానూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన నటుడిగా కూడా బాగా బిజీ అయిపోయారు. మంచి ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకెళుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘కాకినాడ తాలుకా’ అనే ట్యాగ్‌లైన్ మరింత ఆకట్టుకుంటోంది. మోటూరి టాకీస్ పతాకంపై వాణి రవి కుమార్ మోటూరి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 17న ఎలాంటి మ్యాజిక్ చేయనుందో చూడాలి.