ముచ్చటగా మూడోసారి సాహుతో.. దిల్‌రాజును పక్కనబెట్టిన అనిల్?
టాలీవుడ్ హిట్ మిషన్‌గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి నిర్మాతల ఫస్ట్ ఛాయిస్‌గా మారారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతానికి స్టార్ హీరోలైతే ఎవరి సినిమాలతో వారు బిజీ.
టాలీవుడ్ హిట్ మిషన్‌గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి నిర్మాతల ఫస్ట్ ఛాయిస్‌గా మారారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతానికి స్టార్ హీరోలైతే ఎవరి సినిమాలతో వారు బిజీ. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ తదితర హీరోలంతా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక అనిల్ రావిపూడి విషయానికి వస్తే మెండుగా సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు. పటాస్ నుంచి ఈ సంక్రాంతికి వచ్చిన మన శంకర వరప్రసాద్ వరకు ఆయన తీసినవన్నీ హిట్ మూవీసే. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌కి అనిల్ రావిపూడి కోసమే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. సినిమా మొదలు పెట్టింది మొదలు ప్రమోషన్స్‌ను ప్రారంభించేస్తారు. జనం మైండ్‌లోకి తన సినిమాను పంపిస్తారు.
ఈ క్రమంలోనే అనిల్ రావిపూడితో సినిమాలు చేసేందుకు మేకర్స్ ఆసక్తిగా ఉన్నారు. అయితే అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ తీసిన చిత్రాల్లో ఎక్కువగా దిల్ రాజు బ్యానర్ లోనే చేయడం విశేషం. అయితే ‘భగవంత్ కేసరి’ తర్వాత ఆ చిత్ర నిర్మాత సాహు గారపాటితో కలిసి ‘మన శంకరవరప్రసాద్ గారు’ రూపొందించారు. ఈ సంక్రాంతికి ఈ సినిమా మంచి హిట్ కొట్టింది. అయితే నెక్ట్స్ కూడా అనిల్ రావిపూడి.. సాహు గారపాటితోనే కలిసి ట్రావెల్ చేయనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి అనిల్ రావిపూడి.. దిల్ రాజుతో కలిసి ఆరేడు చిత్రాలు చేశారు. అయినా కూడా ఎందుకో ఆయనను పక్కనబెట్టేశారు. వాస్తవానికి దిల్ రాజు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్‌ని అంత తొందరగా వదలరు.
అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి ఒక స్టార్ డైరెక్టర్ అనడంలో సందేహమే లేదు. అయితే అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ కాకుండా బిజినెస్‌లో షేర్ తీసుకుంటారని టాక్. సాహుతో ఈ డీల్ సక్సెస్‌ఫుల్. అందుకే అనిల్ రావిపూడి.. దిల్ రాజును పక్కనబెట్టి సాహుతో కొనసాగుతున్నారని టాక్. సాహుతో చేస్తున్న ఈ సినిమా కూడా సక్సెస్ అయితే ఈ ద్వయం హ్యాట్రిక్ కొట్టినట్టే. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కూడా దిల్ రాజుకు అనిల్ చిక్కనట్టే. అనిల్ నెక్ట్స్ మూవీ.. విక్టరీ వెంకటేష్‌తో కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడని టాక్. మొత్తానికి మల్టీ స్టారర్‌గానో లేదంటే రానా కేమియో రోల్‌లో మెప్పిస్తారో చూడాలి. సినిమా తెరకెక్కించేందుకు పెద్దగా సమయం అయితే అనిల్ తీసుకోరు. ఈ క్రమంలోనే ఈసారి సినిమాను సంక్రాంతి వరకూ ఉంటారో ముందుగానే విడుదల చేస్తారో చూడాలి.