Entertainment

Varun Tej: వరుణ్ తేజ్ కెరీర్‌లోనే తొలిసారిగా..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) ప్రస్తుతం #VT15 చేస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ చిత్రం వరుణ్ తేజ్ (Varun Tej) కెరీర్‌లోనే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే ఈ చిత్రం జానర్ అలాంటిది మరి.

Varun Tej: వరుణ్ తేజ్ కెరీర్‌లోనే తొలిసారిగా..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) ప్రస్తుతం #VT15 చేస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ చిత్రం వరుణ్ తేజ్ (Varun Tej) కెరీర్‌లోనే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే ఈ చిత్రం జానర్ అలాంటిది మరి. హారర్-కామెడీ (Horror and Comedy), ఇండియన్ అండ్ కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. వరుణ్‌తేజ్ తన కెరీర్‌ (Varun Tej Career)లో ఇప్పటి వరకూ కామెడీ చేసిందీ లేదు.. హారర్ చేసిందీ లేదు. కాబట్టి ఆయన తన కెరీర్‌లో తొలిసారిగా కామెడీ అండ్ హారర్ జానర్‌లో నటిస్తున్నారు. అలాగే ఇండియన్ (Indian), కొరియన్ (Korean) బ్యాక్‌డ్రాప్‌లో మూవీ అంటున్నారు.

ఇదంతా చూస్తుంటే సరికొత్తగా చిత్రం ఉండబోతోందని మాత్రం తెలుస్తోంది. మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం రూపొందిస్తున్న షెడ్యూల్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ముఖ్య తారాగణం పాల్గొంటోంది. ఇప్పటికే ఈ చిత్రం మూడు మేజర్ షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూళ్లను ఇండియాతో పాటు ఇతర దేశాల్లో తెరకెక్కించారు. ‘తొలిప్రేమ’ (Tholiprema)తర్వాత మరోసారి వరుణ్ – తమన్ (Taman) కాంబో రిపీట్ కాబోతోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుంచి ఒక ఎక్సైటింగ్ అప్‌డేట్ రానున్నట్టు తెలుస్తోంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 25, 2025 4:02 PM