Samantha: ఎట్టకేలకు సమంత మొదలెట్టింది..
‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) అనే టైటిల్‌ను ఎప్పుడో ప్రకటించింది కానీ చాలా కాలం పాటు ఆ సినిమా ఊసే ఎత్తలేదు. దీంతో ఈ సినిమా కూడా చేయట్లేదేమో.. డ్రాప్ అయ్యిందేమో అనుకున్నారు.
ఎంతో కాలంగా వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. సమంత (Samantha) హీరోయిన్‌గా నటించి చాలా కాలమవుతోంది. తెలుగులో ‘ఖుషీ’ (Khushi) తర్వాత ఆమె చిత్రం వచ్చిందే లేదు. దీంతో ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మధ్యలో ‘శుభం’ (Shubham) సినిమాను నిర్మించి ఒక కేమియో రోల్‌లో నటించింది. ఇక ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) అనే టైటిల్‌ను ఎప్పుడో ప్రకటించింది కానీ చాలా కాలం పాటు ఆ సినిమా ఊసే ఎత్తలేదు. దీంతో ఈ సినిమా కూడా చేయట్లేదేమో.. డ్రాప్ అయ్యిందేమో అనుకున్నారు. కానీ సామ్ ఎట్టకేలకు మొదలు పెట్టేసిందన్న వార్తలు రెండు రోజుల క్రితమే వచ్చాయి.
సమంత హీరోయిన్‌గా ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) చిత్రం ప్రారంభమైంది. అందరూ అనుకున్నట్టుగానే ఈ చిత్రాన్ని నందినీ రెడ్డి (Nandini Reddy) తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా జరిగాయి. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియో ఇవాళ బయటకు వచ్చింది. రాజ్ నిడుమోరు (Raj Nidumoru)తో కలిసి సమంత ఈ చిత్ర పూజలో పాల్గొన్నారు. సమంత తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ (Tralala Moving Pictures) పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా కాదని తెలుస్తోంది. ఒక పిరియాడిక్ గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.
వాస్తవానికి ఇలాంటి జానర్‌లో సమంత ఇంతవరకూ నటించింది. మరోవైపు నందినీ రెడ్డి కూడా ఇలాంటి కథను తెరకెక్కించింది లేదు. ఇలాంటి జానర్ ఇద్దరికీ కొత్తే కాబట్టి మరి ఈ సినిమాను ఎలా రూపొందిస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. పిరియాడిక్ మూవీ అంటే 1980ల నాటి కథ కాబట్టి సమంత ఆ పాత్రలో ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది. వాస్తవానికి ‘యశోద’ తర్వాత గట్టి ప్రాధాన్యత ఉన్న సోలో పాత్రలో సమంత నటించింది లేదు. మొత్తానికి సమంత సినిమాను ప్రారంభించడంతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తుండటంతో అభిమానులు ఫుల్ హ్యాపీ.
ప్రజావాణి చీదిరాల