Entertainment

Rashmika Mandanna: విజయ్‌తో నిశ్చితార్థం.. మీకేదనిపిస్తే అదే నిజం..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Rowdy Hero Vijay Devarakonda)తో ఎంగేజ్‌మెంట్‌పై కూడా స్పందించింది. ఈ క్రమంలోనే తనకు నచ్చిన..

Rashmika Mandanna: విజయ్‌తో నిశ్చితార్థం.. మీకేదనిపిస్తే అదే నిజం..

రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నవంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే రష్మిక సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తోంది. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Rowdy Hero Vijay Devarakonda)తో ఎంగేజ్‌మెంట్‌పై కూడా స్పందించింది. ఈ క్రమంలోనే తనకు నచ్చిన ‘డియర్ కామ్రేడ్’ (Dear Comrade) చిత్రం గురించి కూడా రష్మిక చెప్పుకొచ్చింది.

2019లో వచ్చిన ఈ చిత్రం ఒక డిజాస్టర్ అని చెప్పాలి. అయితే ఈ చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమని రష్మిక ఎన్నో సార్లు చెప్పింది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సైతం ఈ చిత్రం తనకు ఇష్టమని పలు సందర్భాల్లో తెలిపాడు. తాజాగా దీనిపై స్పందించిన రష్మిక (Rashmika) ఈ చిత్రానికి సరైన ఆదరణ దక్కలేదని తెలిపింది. తాను ఈ చిత్రాన్ని ఆడియన్స్‌తో కలిసి చూశానని వెల్లడించింది. అయితే ఫలితం మాత్రం తమకు అంచనాలకు విరుద్ధంగా వచ్చిందని పేర్కొంది. ఇక ఈ సినిమాకు బయటకు వచ్చిన తర్వాత గట్టిగా ప్రమోషన్స్ (Movie Promotions) నిర్వహిద్దామని మేకర్స్‌కు చెప్పానని కానీ అది కుదరలేదని వెల్లడించింది.

ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రం గురించి ఇప్పడు మాట్లాడుకోవడంతో పాటు సోషల్ మీడియా (Social Media)లో పోస్టులు పెడుతున్నారని వెల్లడించింది. ఒక సినిమా కోసం దర్శక నిర్మాతల కష్టానికి తగిన ఫలితం రాకుంటే చాలా బాధేస్తుందని.. అలాగే ఆ సమయంలో సినిమాను ఆదరించకుండా మూడేళ్ల తర్వాత ప్రశంసించినా అలాగే బాధేస్తుందని రష్మిక తెలిపింది. ఇక రష్మికను ఓ ప్రెస్‌మీట్‌లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో నిశ్చితార్థం గురించి ప్రశ్నించగా.. ఆమె ఆసక్తికర సమాధానమిచ్చారు. దాని గురించి ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెబుతానని.. ఈ విషయంలో మీకేదనిపిస్తే అదే నిజమని రష్మిక చెప్పుకొచ్చింది.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 28, 2025 2:40 PM