Entertainment

Biggboss 9: బిగ్‌బాస్ హౌస్ కెప్టెన్‌గా ఇమ్మాన్యుయేల్.. బ్యాడ్‌లక్ ఏంటంటే..

ఇవాళ బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ హ్యాట్‌తో వేట పేరుతో బిగ్‌బాస్ నిర్వహించారు. ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ (Biggboss House Captain Emmanuel) అయ్యాడు. ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అవడం అనేది గుడ్ లక్కే కదా.. బ్యాడ్ లక్ ఏంటంటారా?

Biggboss 9: బిగ్‌బాస్ హౌస్ కెప్టెన్‌గా ఇమ్మాన్యుయేల్.. బ్యాడ్‌లక్ ఏంటంటే..

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) ఈ వారం అయితే బిగ్‌బాస్ చూసేవారికి విరక్తి రావొచ్చు. ఎందుకంటే ఈ వారమంతా అంత చప్పగా సాగుతోంది. కంటెస్టెంట్స్ చేత రకరకాల వేషాలు వేయించి తెలుగు బిగ్‌బాస్ చరిత్ర (Biggboss History)లోనే చెత్త టాస్క్‌ను కంటెస్టెంట్స్‌కు ఇవ్వడం జరిగింది. ఎలాగో రెండు రోజుల పాటు నడిపించిన మీదట కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌ను బిగ్‌బాస్ ముగించాడు. ఇక ఇవాళ బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ హ్యాట్‌తో వేట పేరుతో బిగ్‌బాస్ నిర్వహించారు. ఈ టాస్క్‌లో రెండు గ్రూపుల నుంచి ముగ్గురు చొప్పున పాల్గొన్నారు.

హ్యాట్‌తో వేట..

ఇమ్మాన్యుయేల్ (Emmanuel), నిఖిల్ (Nikhil), రీతూ చౌదరి (Rithu Chowdary), తనూజ (Tanuja), దివ్య నికిత (Divya Nikitha), కల్యాణ్ పడాల (Kalyan Padala) ఈ కెప్టెన్సీ టాస్క్ (Captaincy Task)లో పాల్గొన్నారు. ఒక సర్కిల్ గీసి దాని మధ్యలో హ్యాట్‌ను పెట్టాడు బిగ్‌బాస్. దానిని పట్టుకుని తమ గ్రూప్ మెంబర్స్‌కి ఇస్తే వారు ఎదుటి గ్రూపు నుంచి ఒకరు చొప్పున తొలగిస్తారు. అలా అందర్నీ తీసివేయగా ఫైనల్‌గా ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ (Biggboss House Captain Emmanuel) అయ్యాడు. ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అవడం అనేది గుడ్ లక్కే కదా.. బ్యాడ్ లక్ ఏంటంటారా? వరుసగా ఆరు వారాలుగా ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్ (Biggboss Naminations) లోకి వచ్చిందే లేదు. ఇలా కొన్ని వారాల పాటు నామినేషన్స్‌లోకి రాకుంటే అతని ఓటు బ్యాంక్ అనేది దారుణంగా పడిపోతుంది.

ఆది నుంచి ఇమ్మూ సేఫ్ గేమ్..

ఈ వారం కూడా కెప్టెన్ అయ్యాడు కాబట్టి నామినేషన్స్ నుంచి ఇమ్మాన్యుయేల్ సేవ్ అయినట్టే. అంటే ఏడు వారాలు. ప్రేక్షకులంతా తరచూ నామినేషన్స్‌లోకి వచ్చేవారికి ఓటు వేస్తారు కానీ ఇలా వారాల తరబడి నామినేషన్స్‌లోకి రాకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయరు. బై మిస్టేక్ ఎనిమిదో వారం నామినేషన్స్‌లోకి ఇమ్మూ వచ్చాడంటే బయటకు వెళ్లిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గేమ్ గురించి పక్కాగా తెలిసిన ఇమ్మూ ఈ విషయాన్ని ఎందుకు గ్రహించడం లేదో అర్థం కావడం లేదు. ఇప్పటికీ సేఫ్ గేమ్ ఆడుతూనే ఉన్నాడు. మొత్తానికి ఇమ్మూ నామినేషన్స్‌కి వచ్చాడంటే డేంజర్ జోన్‌లోకి అడుగు పెట్టినట్టే అనడంలో సందేహమే లేదు. మరి ఎప్పుడు వస్తాడో చూడాలి. అప్పుడు ఏం జరుగుతుందనే ఆసక్తి కూడా చాలా మందిలో ఉంది.

భరణికి వెన్నుపోటు..

పైగా ఇటీవలి కాలంలో ఇమ్మూ నెగిటివిటీని బాగా ఎదుర్కొంటున్నాడు. తను సంజన (Sanjana Garlani)తో అమ్మాకొడుకు బాండింగ్‌లో ఉండి భరణి (Bharani), తనూజ (Tanuja) బాండింగ్‌ను మాత్రం హైలైట్ చేసి ఆయనను బయటకు పంపడంలో ప్రథమ పాత్ర పోషించాడని కూడా అంతా భావిస్తున్నారు. భరణి ఎలిమినేషన్‌ (Bharani Elimination) సమయంలోనూ తన దగ్గరున్న సేవింగ్ ఆప్షన్‌ను ఆయనకు వాడకుండా గేమ్ ఆడటంతో ఆ రకంగా కూడా నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. దాదాపుగా భరణి బయటకు రావడానికి అన్ని రకాలుగా కారణం ఇమ్మాన్యుయేలేనంటూ బయట బాగా రచ్చ జరిగింది. ఒకరకంగా భరణితో బాగా ఉంటూ వెన్నుపోటు పొడిచాడని అంతా భావిస్తున్నారు. తనూజను తను కాకుండా కల్యాణ్ పడాలతో నామినేషన్ చేయించాలనుకోవడం మరో దారుణం. ఈ విషయంలోనూ బీభత్సమైన నెగిటివిటీని మూటగట్టుకున్నాడు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 24, 2025 11:30 AM