Entertainment

Fahad Fazil: 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' పవర్‌ఫుల్ డైలాగే కాదండోయ్.. ఇప్పుడిది..

'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' (Don't Trouble the Trouble) అనగానే మనకు గుర్తొచ్చేది నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పవర్‌ఫుల్ డైలాగ్. ఇప్పుడిది డైలాగే కాదండోయ్..

Fahad Fazil: 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' పవర్‌ఫుల్ డైలాగే కాదండోయ్.. ఇప్పుడిది..

'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' (Don't Trouble the Trouble) అనగానే మనకు గుర్తొచ్చేది నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పవర్‌ఫుల్ డైలాగ్. ఇప్పుడిది డైలాగే కాదండోయ్.. మూవీ టైటిల్. ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ‘బాహుబలి’ వంటి చిత్రాలను నిర్మించిన సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ (Arka Media Works), షోయింగ్ బిజినెస్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమే 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. నూతన దర్శకుడు శశాంక్ యేలేటి (Sasank Yeleti) ఈ చిత్రాన్ని థ్రిల్లింగ్ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.

ఎస్ఎస్ కార్తికేయతో కలిసి ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ (Shobhu Yarlagadda), ప్రసాద్ దేవినేని (Prasad Devineni) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నరక చతుర్దశి (Naraka Chaturdasi) నాడు అంటే ఆదివారం (అక్టోబర్ 19) ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. తొలిరోజు షూటింగ్‌లో ఫహాద్ ఫాజిల్ షూటింగ్ జాయిన్ అయ్యారు. తొలి షెడ్యూల్ నవంబర్ 8 వరకూ కొనసాగనుంది. ఫస్ట్ షెడ్యూల్‌లోనే సినిమాకు సంబంధించిన ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 19, 2025 3:49 PM