Movie Review: మూవీ రివ్యూ ఈ ప్రమాణాలకు తగినట్టుగానే ఉంటోందా?
ఈ వారం నాలుగు సినిమాలు (Movies) విడుదలయ్యాయి. వీటన్నింటికీ రివ్యూవర్లు (Movie Reviewers) వాళ్లకు నచ్చినట్టుగా రివ్యూలు ఇచ్చేశారు. ఒక్కొక్కరి రివ్యూ ఒక్కోలా ఉంది. అవన్నీ సరైనవేనా? అంటే చెప్పలేం.

ఈ వారం నాలుగు సినిమాలు (Movies) విడుదలయ్యాయి. వీటన్నింటికీ రివ్యూవర్లు (Movie Reviewers) వాళ్లకు నచ్చినట్టుగా రివ్యూలు ఇచ్చేశారు. ఒక్కొక్కరి రివ్యూ ఒక్కోలా ఉంది. అవన్నీ సరైనవేనా? అంటే చెప్పలేం. ప్రస్తుతం పెయిడ్ రివ్యూల కాలం నడుస్తోంది. డబ్బు కవర్ చేతిలో పడితే ఒకలా.. లేదంటే మరోలా.. ఇలాంటి వారి కారణంగా మంచి సినిమాలు ఇబ్బందిపడుతున్నాయి. రివ్యూలు బ్యాడ్‌గా వచ్చిన సినిమాలు ఆ తరువాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ప్రస్తుతం మౌత్ టాక్ (Mouth Talk)పైనే సినిమాలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీనికి కారణం రివ్యూయర్లే అనడంలో సందేహం లేదు. రివ్యూలు ఇచ్చేవారికి కనీసం దాని నియమాలు కూడా తెలియడం లేదంటే అతిశయోక్తి కాదు. మంచి రివ్యూ రాయాలంటే ఏం నియమాలుంటాయి? చూద్దాం.
రివ్యూ ఎప్పుడైనా ఒకరి దృష్టి కోణం మాత్రమే. ఒకరి వ్యూకి.. మరొకరి వ్యూకి చాలా తేడా ఉంటుంది. విషయం ఒక్కటే అయినా కూడా అర్థం చేసుకునే తీరులోనే అసలు కథంతా ఉంటుంది. తొలుత సినిమా రివ్యూ చేయాలంటే చిత్ర కథాంశం గురించి క్లారిటీ తెచ్చుకోవాలి. కథ ఎలా ఉంది? క్లైమాక్స్ ఎలా చిత్రీకరించారు? నటీనటుల ఎలా చేశారు? పాత్రలను తీర్చిదిద్దిన తీరు ఎలా ఉంది? టెక్నికల్ పరమైన అంశాలు.. అంటే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్, బీజీఎం వంటివన్నీ చూడాల్సి ఉంటుంది. సినిమా పరంగా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో నేరుగా దానిని చెప్పగలిగారా? లేదా? వంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సినిమాను చూసిన తర్వాత మాత్రమే రివ్యూ ఇవ్వాలి.